ఈరోజుల్లో మనదేశంలోకి అనేక బహుళజాతి కంపెనీలు కుప్పలు తెప్పలుగా ప్రవేశిస్తోన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి కంపెనీల్లో అన్ని స్థాయిల్లోనూ ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో "సాఫ్ట్‌స్కిల్స్"కు బాగా ప్రాముఖ్యం ఏర్పడింది. "
సాఫ్ట్ స్కిల్స్" అంటే స్థూలంగా... రాతపూర్వకంగా, మౌఖికంగా (మాట్లాడే) సానుకూల ధోరణితో తోటి ఉద్యోగులతో సంబంధ బాంధవ్యాలను పెంపొందించుకోవడమే. ఐటీ ఉద్యోగులు కంపెనీల్లో ఉన్నత స్థానాలకు వెళ్లే కొద్దీ సాఫ్ట్ స్కిల్స్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందుకే కంపెనీలు కూడా తమ శిక్షణా కార్యకలాపాల్లో వీటిని భాగం చేస్తున్నాయి.ప్రెషర్స్‌కు అధిక ప్రాధాన్యం..! |
|
సాఫ్ట్ స్కిల్స్ కలిగి ఉన్న ప్రెషర్స్‌కు (చదువు ముగించుకుని కళాశాలల నుండి అప్పుడే బయటపడ్డవారు) కార్పొరేట్ సంస్థలు తమ తమ నియామకాల్లో అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. కాబట్టి, విద్యార్థుల్లో వీటిపట్ల అవగాహన పెరుగుతోంది. కెరియర్‌ను ఎంచుకోవడానికి ముందుగానే.. |
|
|
ముఖ్యంగా సాఫ్ట్ స్కిల్స్‌లో రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి.. సరైన లక్షణాలను, ఆలోచనా ధోరణిని (గుడ్ ఆటిట్యూడ్) పెంపొందించుకోవాడం. ఇక రెండోది ఏంటంటే... ఆలోచనలను సరైన రీతిలో వ్యక్తీకరించేందుకు అవసరమైన కమ్యూనికేషన్ సామర్థ్యాలను పెంచుకోవడం. ఈ రెండు అంశాలు ఎప్పుడూ ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేస్తాయి.
మాట్లాడేటప్పుడు ఉపయోగించే భాష, పదజాలం, బాడీ లాంగ్వేజ్, సరైన భావ వ్యక్తీకరణ... లాంటివన్నీ కమ్యూనికేషన్‌లో భాగం కాగా, ఇతరులతో సంబంధాలు, సమయపాలన, ఒత్తిడిని తట్టుకోవడం లాంటివి కూడా సాఫ్ట్ స్కిల్స్ పరిధిలోకి వస్తాయి.
పైన చెప్పుకున్న లక్షణాలున్న ప్రెషర్స్‌కు (చదువు ముగించుకుని కళాశాలల నుండి అప్పుడే బయటపడ్డవారు) కార్పొరేట్ సంస్థలు తమ తమ నియామకాల్లో అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. కాబట్టి, విద్యార్థుల్లో వీటిపట్ల అవగాహన పెరుగుతోంది. కెరియర్‌ను ఎంచుకునేందుకు ముందే సాఫ్ట్ స్కిల్స్‌పై వీరు దృష్టి పెడుతున్నారు.
ఇక చివరిగా చెప్పేదేంటంటే... విద్యార్హతలతో పాటు అవసరమైన, ముఖ్యమైన సాఫ్ట్ స్కిల్స్ అనేవి లేకుండా కార్పొరేట్ రంగంలో పైకి ఎదగటం అంత తేలికైన విషయం కాదు. కాబట్టి, సాఫ్ట్ స్కిల్స్‌లో నైపుణ్యం సాధించేందుకు... కమ్యూనికేషన్, ప్రెజేంటేషన్, ఇంగ్లీష్, నాయకత్వం, బృంద చర్చలు, ఇంటర్వ్యూలు ఎదుర్కోవటం, వ్యాపార సంప్రదింపులు తదితర విషయాల్లో తర్ఫీదునిచ్చే ఓ మంచి సంస్థలో శిక్షణ తీసుకోవడం మంచిది.