Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"విదేశీ" విద్యకు కొన్ని సూచనలు

, శుక్రవారం, 16 జనవరి 2009 (14:57 IST)
ప్రస్తుత పోటీ ప్రపంచంలో విదేశీ విద్యను అభ్యసించాలని ప్రతి విద్యార్థి కోరుకుంటారు. ఈ విద్యను అభ్యసించేందుకు పలువురు విద్యార్థులకు తమకు తెలియకుండానే పలు తప్పులు చేస్తుంటారు. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థి ప్రధానంగా కొన్ని ప్రమాణాలను పాటించాల్సి వుంటుంది. ఈ సూత్రాలను పాటించిన పక్షంలో విదేశీ విద్యను పూర్తి చేయడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

* విదేశీ విద్యను అభ్యసించాలనుకున్న విద్యార్థి ప్రధానంగా తొలుత చేయాల్సింది సరైన సలహాలు స్వీకరించాలి. ఇందుకోసం సరైన సమాచార కేంద్రాన్ని సంప్రదించాలి.
* మీ కెరీర్ ప్లాన్‌, చేయదలచుకున్న విద్యాకోర్సులను స్పష్టంగా వివరించాలి.
* తాము ఎంచుకున్న విద్యా కోర్సులకు ఎలా అడ్మిషన్లు పొందాలి. వాటికి మార్గాలేమిటి?
* విదేశీ విద్యను అభ్యసించేదుకు గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ ఎగ్జామినేషన్స్‌ను ఎక్కడ, ఎలా రాయాలనే సమాచారాన్ని తెలుసుకోవాలి.
* మీ ఆర్థిక స్థోమతను విదేశీ విద్యా సంస్థల ప్రతినిధులకు పూర్తిగా వివరించాలి.
* ప్రధానంగా టెస్ట్ ఆప్ ఇంగ్లీష్ యాస్ ఏ ఫారిన్ లాంగ్వేజ్ ఎగ్జామినేషన్‌తో సహా, టెస్ట్ ఆప్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్స్‌ను రాయడం మంచిది.

* మీరు ఎంచుకున్న కోర్సును పూర్తి చేసేందుకు కనీసం పది నుంచి 15 విద్యా సంస్థలను పరిశీలించాలి
* దరఖాస్తును పూర్తి చేసేముందు అత్యంత జాగరూకతతో వ్యవహరించాలి. ఆ తర్వాత ప్రతి కాలాన్ని జాగ్రత్తగా పరిశీలించి పూర్తి చేయాలి.
* మీకు ఆర్థిక వనరులు అవసరమైతే.. తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి.
* విద్యా సంస్థల నుంచి ఆఫర్ వచ్చేంత వరకు వేచిచూసే ధోరణిని అవలంభించడం మంచింది.
* మీరు నివశించేందుకు క్యాంపస్‌ లేదా గృహం అనుకూలంగా ఉంటుందో నిర్ణయించుకోవాలి.
* విద్యార్థి విసాకోసం దరఖాస్తు చేసుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu