ఉద్యోగం సంపాదించాలంటే, విద్యార్హతలు ఉంటే మాత్రం సరిపోదు. మరెన్నో శక్తి సామర్థ్యాలు, ప్రత్యేకతలను కూడా కలిగి ఉండాలి. అప్పుడే ఉద్యోగ వేటలో ముందుంటారు. వందల సంఖ్యలో ఉండే కంపెనీల్లో మంచిపేరు కలిగిన వాటిని మనం ఎంచుకున్నట్లుగానే, ఉద్యోగులను నియమించేటప్పుడు వేల సంఖ్యలో ఉన్న అభ్యర్థుల్లోంచి మంచి శక్తి సామర్ధ్యాలను కలిగి ఉన్నవారికే కంపెనీలు ఎంచుకుంటాయి.కాబట్టి, ప్రస్తుత స్పీడ్ యుగంలో ఉద్యోగం సంపాందించాలంటే... ప్రతిభ, శక్తి సామర్థ్యాలే భవిష్యత్తుకు కొలమానాలుగా ఉంటున్నాయి. అన్ని రంగాలలో అత్యున్నతం, ప్రత్యేకం, అసాధారణం అనే ఈ మూడు లక్షణాలను కలిగి ఉన్నవారే పోటీలో ముందంజలో ఉండగలుగుతారు. విజయాలను సాధించగలుగుతారు. |
మీకంటూ ఓ నెట్‌వర్క్‌ను ఏర్పర్చుకుని, ఆయా సంబంధాలను పెంపొందించుకోవడం చాలా అవసరం. ఇలా చేయడం వల్ల, తోటి వారిని అప్పుడప్పుడు సంప్రదించటం వల్ల ఉద్యోగాలకు పోటీ అనేది ఏ స్థాయిలో ఉంది, దాన్ని ఎలా అధిగమించాలి అన్న విషయాలపై ఓ స్పష్టత ఏర్పడుతుంది... |
|
|
ప్రతిభ, సామర్థ్యం, వ్యక్తిత్వం... అనే మూడింటిలో అభ్యర్థుల మధ్య అంతరాలు సృష్టిస్తాయి. వీటిలో మీ నైపుణ్యం ఏ మేరకు ఉంటుందో, అదే మీ భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. మిమ్మల్ని మీరు గొప్పవారిగా అనుకోవడమే కాదు, మీ బలాలు, బలహీనతలు, నైపుణ్యాల గురించి మీకు తెలిసి ఉండాలి.
మీలో ఉన్న ప్రత్యేక నైపుణ్యం, వ్యక్తిత్వాలను మీ యజమాని, సహచరులు గుర్తించగలిగేలా ఉండాలి. అలాగే, పనిలో నిదానం, చొరవ లేదు అనే బ్రాండ్‌లు ఒకసారి మీమీద పడితే... అవే మీ భవిష్యత్తును నాశనం చేసేవి అవుతాయి. కాబట్టి, ఇలాంటి బ్రాండ్‌లు పడకుండా జాగ్రత్తపడాలి.
ఇంకా... ఆరునెలలపాటు పనిచేసిన అనుభవమున్నా, ఉద్యోగ పోటీలో చాలామంది కంటే మిమ్మల్ని ముందు ఉంచుతుంది. అనుభవం ఉన్నవారు ఎలాంటి ఉద్యోగంలో అయినా త్వరగా కుదురుకోవచ్చు. అలాగే చాలా ఉద్యోగాలలో విధి నిర్వహణలో భాగంగా తిరగాల్సి వస్తుంది. దీనికి కూడా సిద్ధపడినట్లైతే ఉద్యోగ అర్హతలో మీరు పై మెట్టులో ఉంటారనడంలో ఆశ్చర్యం లేదు.
ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే... మీదంటూ, మీకంటూ ఓ నెట్‌వర్క్‌ను ఏర్పర్చుకుని, ఆయా సంబంధాలను పెంపొందించుకోవడం చాలా అవసరం. ఇలా చేయడం వల్ల, తోటి వారిని అప్పుడప్పుడు సంప్రదించటం వల్ల ఉద్యోగాలకు పోటీ అనేది ఏ స్థాయిలో ఉంది, దాన్ని ఎలా అధిగమించాలి అన్న విషయాలపై ఓ స్పష్టత ఏర్పడుతుంది.
పైన చర్చించిన అంశాలపై దృష్టి పెట్టి, శ్రద్ధగా ప్రయత్నం చేయండి. విజయం మిమ్మల్నే వరిస్తుందేమో...?!