ప్రస్తుత ఆధునిక కాలంలో విద్య, ఉద్యోగం వంటి అన్నీ రంగాల్లోనూ పోటీ అనేది సర్వసాధారణమైన విషయం. ఇలాంటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్క రంగంలోనూ ఆ పోటీని తట్టుకుని రాణించేందుకు సంపూర్ణ శక్తి సామర్థ్యాలు మనలో ఉండాలని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే వారు... మీ కెరీర్ మీ చేతుల్లోనే ఉందంటున్నారు. మీ కెరీర్‌ను మలచుకునేందుకు విద్యార్హతలు, నైపుణ్యాలు, అదనపు ప్రత్యేకతలు, ఆకట్టుకునే ఆహార్యము చాలా ముఖ్యం.
మీ కెరీర్‌ను ఎలా మలచుకువాలంటే...
ఆహార్యం... అంటే కేవలం దుస్తులే గాకుండా, దేహభాష, ముఖకవళికలను మీకు అనుగుణంగా, ప్రెజెంటబుల్‌గా మిమ్మల్ని మలచుకోవాలి. ప్రస్తుతం మీ ఉద్యోగవకాశానికి అనుగుణంగా దుస్తులు ధరించడం పరిపాటి.
అందుచేత ప్రత్యేక అలంకరణలు చేసుకోకుండా... నూటికి నూరుపాళ్లు ప్రొఫెషనల్‌గా కనిపించేలా దుస్తులు ధరించడం, భాషను మార్చుకోవడం చేసుకోవాలి. ఆహార్యంపై శ్రద్ధ చూపితే మీలో ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్ఫథం చేకూరుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఇకపోతే... ప్రస్తుతం మీ తరహా ఉద్యోగంలో ఉన్నవారు ధరిస్తున్న దుస్తులు.. యాక్సెసరీల తీరుతెన్నులు ఎలా ఉన్నాయో గ్రహించి.. దానికనుగుణంగా.. మీ శరీరాకృతికి నప్పే దుస్తులనే ధరించాలి. మీరు ఆఫీసుకు ధరించే దుస్తులు... పార్టీలు ఇతర సందర్భాలకు వేసుకునే దుస్తుల మధ్య అంతరం ఉండి తీరాలి. సందర్భోచితంగా దుస్తులను ధరించడం చేయాలి.
ఇంకా... కేశాలంకరణ, మేనిఛాయకు తగినట్లు మీ భాష, నిటారుగా ఉండటం వంటి ఇతరత్రా అంశాలపై శ్రద్ధ చూపాలి. వాలిపోయినట్లుగా... ఒంగిపోయినట్లుగా.. ఉండటం మీలో ఆత్మవిశ్వాసం లోపించిందన్న విషయాన్ని బహిర్గతం చేస్తుందంటున్నారు పరిశోధకులు. కాబట్టి.. ఆకర్షణీయంగా.. హుందాగా కనిపించే మేకప్ తప్పనిసరి. ఎన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నా.. మీ ముఖంలో ఎప్పుడు చెదరని చిరునవ్వును మాత్రం మరిచిపోకూడదు.
కేశాలంకరణ నుంచి పాదాల సంరక్షణ వరకు మీలో ప్రొఫెషనలిజం సంపూర్ణంగా కనిపించాలి. అప్పుడే.. ఉద్యోగాన్ని మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో చేయగలరని పరిశోధకులు అంటున్నారు.