Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాతృభాష ప్రభావాన్ని అధిగమించటమెలా..?

మాతృభాష ప్రభావాన్ని అధిగమించటమెలా..?
, గురువారం, 9 అక్టోబరు 2008 (17:23 IST)
FileFILE
మాతృభాషలో ఆలోచించి, దాన్ని నేరుగా అలాగే ఇంగ్లీషు భాషలోకి అనువదించినప్పుడు మాట్లాడే ఇంగ్లీష్‌మీద మాతృభాష ప్రభావం పడుతుంది. ప్రతిఒక్కరికీ తమదంటూ ఒక స్థానిక భాష ఉంటుంది. మాతృభాషపై మనకుండే పట్టువల్ల ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మనకు తెలియకుండానే దాని ప్రభావం ఇంగ్లీష్‌పై ఉంటుంది. ఇంగ్లీష్ ఒక్కటేకాదు, మాతృభాష తప్ప మరే ఇతర భాష మాట్లాడినా ఈ ప్రభావం ఎంతో కొంత ఉండనే ఉంటుంది.

ఆలోచనల్లో స్పష్టత, భాషలో ప్రావీణ్యం ఉంటేనే మంచి కమ్యూనికేషన్ అనేది సాధ్యపడుతుంది. కాబట్టి, ఇంగ్లీషుపై మాతృభాష ప్రభావాన్ని అధిగమించాలంటే... భాషలో శిక్షణనిచ్చే మంచి సంస్థలో చేరడంతో పాటుగా, స్వీయ అభ్యాసం ద్వారా భాషపై పట్టు సాధించవచ్చు. ఇలా చేయడం వల్ల ఉచ్ఛారణలో మెలకువలు నేర్చుకోవడమే గాకుండా... ఇంగ్లీషులోనే మాట్లాడటం, రాయటం, చదవటం అలవాటవుతుంది.

అలాగే, వార్తాపత్రికలు, మ్యాగజైన్లను పెద్దగా చదవటం ద్వారా కూడా ఉచ్ఛారణను మెరుగుపరచుకోవచ్చు. రోజూ అభ్యాసం చేస్తేనే దీని వల్ల ఫలితం మెండుగా ఉంటుంది. ఇంకా... ఇంగ్లీష్ సినిమాలు, టీవీ ఛానళ్లు చూడటం ద్వారా కూడా వాళ్లు తమ భాషను ఎలా మాట్లాడుతున్నారో గమనించవచ్చు. అలాగే మీరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయవచ్చు.

పని స్థలాలలో సహోద్యోగులు, మిత్రులతో కూడా ఇంగ్లీషులోనే మాట్లాడే ప్రయత్నం చేశారంటే... దీర్ఘకాలంలో మంచి ఫలితం పొందుతారు. ఇక, మాతృభాషలో కాకుండా, ప్రతిదాన్నీ అనువదించకుండా... నేరుగా ఇంగ్లీష్‌లోనే ఆలోచించండి. సరైన ఉచ్ఛారణ కోసం డిక్షనరీని చూడండి. టేప్‌లు వింటూ అలాగే పలికేందుకు ప్రయత్నించినా తప్పక ఫలితం ఉంటుంది.

మాతృభాష ప్రభావం ఉందనుకుంటే... ఇక మీ భాషా పరిజ్ఞానాన్ని ఇక పెంపొందించుకోలేరని అర్థం కాదు. క్రమం తప్పకుండా అభ్యాసం చేయడం ద్వారా ఏదైనా నేర్చుకోవచ్చు. ఏ భాషలోనయినా ప్రావీణ్యం సంపాదించాలంటే ముందుగా చక్కని ప్రణాళిక, అందుకు తగిన సమయం ఏంతో అవసరమన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు.

Share this Story:

Follow Webdunia telugu