Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భవిష్యత్ నిరుద్యోగ అంధకారమే!

భవిష్యత్ నిరుద్యోగ అంధకారమే!
, మంగళవారం, 10 ఫిబ్రవరి 2009 (13:26 IST)
అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ధాటికి భారత కంపెనీలు మూతపడే స్థితికి దారితీస్తున్నాయి. దీనివల్ల భవిష్యత్‌లో వేలాది మంది ఉద్యోగులు తమ కొలువులను కోల్పోవాల్సి వస్తుందని ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక సంస్థ సిటీ గ్రూపు తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

ఈ గ్రూపుకు చెందిన భారతీయ శాఖల్లోని ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగించేందుకు సమాయత్తమవుతోంది. ఉపాధి కల్పనపై, ఆత్మవిశ్వాసంపై, ధరల స్థితిగతులపై గతంలో కంటే మరింత ఒత్తిడి పెరుగుతుందని పేర్కొంది.

దీనికి తోడు వలస కార్మికులు భారత దేశానికి తిరిగి రావడం, దాంతో భారత దేశానికి చేరే విదేశీ మారక ద్రవ్య పరిమాణం గణనీయంగా పడిపోవడం జరుగుతుందని సిటి ఇండియా ఆర్థివేత్త రోహిణి మల్కాని తయారు చేసిన నివేదికలో పేర్కొన్నారు.

కాగా, ఇప్పటికే దేశంలోని నగలు, వజ్ర వైఢూర్యాల వాణిజ్య రంగం, ఆటో, టెక్స్ టైల్స్‌లాంటి ఎగుమతి ఆధారిత రంగాల్లో గత సంవత్సరం మూడో త్రైమాసికంలో పలువురు ఉద్యోగాలు కోల్పోయినట్టు కేంద్ర కార్మిక శాఖ ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. మొత్తం శ్రామిక శక్తిలో దాదాపు 10 శాతంగా ఉన్న సంఘటిత రంగంలో పనిచేస్తున్న 38.5 కోట్ల మందికి సంబంధించిన గణాంకాలను మాత్రమే ఈ నివేదిక వెల్లడించింది.

ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఉద్యోగ భద్రత కీలక ఎన్నికల నినాదంగా మారుతుందని ఆ నివేదిక తెలిపింది. భారత దేశ నిరుద్యోగ రేటు ప్రస్తుతం అధికారికంగా 8.2 శాతంగా ఉన్న విషయం తెల్సిందే. ఇది ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికల అస్త్రంగా దోహదపడుతుందని రోహిణి అభిప్రాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu