భవన నిర్మాణం కొత్త పుంతులు తొక్కుతోంది. కంప్యూటర్ విజ్ఞాన మేళవింపుతో ఆధునిక భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ కోర్సులు చేసిన వారికి చాలా అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఒక దశలో సివిల్ ఇంజనీర్లే అన్ని పనులు చేసేవారు. కాలాలు మారిపోయాయి.
మీడియా, రవాణా రంగాలు కొత్తపుంతలు తొక్కడంతో ప్రపంచ దేశాల మధ్య సంస్కృతి, సంప్రదాయాలు పంచుకునే అవకాశం వచ్చింది. అంతే సివిల్ ఇంజనీరింగ్‌లో కొత్త కొత్త విభాగాలు ప్రవేశించాయి. ఇందులో భాగమే బిటెక్ ఆర్క్ ప్రవేశించింది. ఇది భవన నిర్మాణంలో నవీనపోకడలకు ఆధారంగా నిలుస్తోంది. ఈ కోర్సుకు మంచి గిరాకీ ఉంది.
ఈ కోర్సు చదవడానికి జనం ఉవ్విళూరుతున్నారు. ప్రముఖ సాంకేతిక సంస్థలు ఈ విభాగంలో నిపుణుల కోసం పరుగులు పెడుతున్నాయి. భవన నిర్మాణరంగంలోని కార్పొరేట్ సంస్థలు ఈ నిపుణులకు రెడ్‌కార్పెట్ పరుస్తున్నాయి. వేతనాలు కూడా చాలా ఎక్కువగానే ఇస్తున్నాయి. ఇలాంటి కోర్సును చేయడానికి అవసరమైన విద్యార్హతలేమిటో చూద్దాం రండీ..
చదవడానికి అర్హతలు
బీ.ఆర్క్ చదవడానికి కనీసం గణితంతో ప్లస్ 2 పూర్తి చేయాలి. గణితం, ఆంగ్లం సబ్జక్టులలో కనీసం 50శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇలాంటి వారు కోర్సుకు అర్హులవుతారు. ఆయా రాష్ట్రాలు నిర్వహించే ప్రవేశ పరీక్షలు పాస్ కావాలి. 5యేళ్ళ నిడివి కలిగిన ఈ కోర్సు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సంస్థ గుర్తింపు పొంది ఉండే కళాశాలలను ఎన్నుకోవాలి.
పీజీ కోర్సలకైతే...
ఆర్కీటెక్చర్‌లో ఎంటెక్ చేయాలనుకునే వారు కనీసం బీటెక్ ఆర్కిటెక్ లేదా తత్సమాన డిగ్రీని కలిగి ఉండాలి. వివిధ విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలు వీటిని ఆఫర్ చేస్తున్నాయి. ఆయా విశ్వవిద్యాలయాలు నిర్వహించే ప్రవేశ పరీక్షలను నెగ్గాల్సి ఉంటుంది. ఈ కోర్సులను ఐఐటీ కారగ్‌పూర్, రూర్కెలాలు కూడా ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఈ కోర్సుకు చాలా పోటీ ఉంటుంది.
ప్రత్యేక విభాగాలున్నాయా
అవును ఖచ్చితంగా ఎం.ఆర్క్‌లో ప్రత్యేకతలుంటాయి. వీటిలో హాస్పటళ్ల నిర్మాణం, షాపింగ్ మాల్స్, నివాస ప్రాంతాలు, విద్యా సంస్థలు, హోటళ్ళ నిర్మాణాల ఐచ్చికతలు చాలా పేరు మోసినవిగా ఉన్నాయి.