Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

గ్రామీణ యువతకు మహదావకాశం...ఆర్ఎస్ఈటీఐ

Advertiesment
గ్రామీణ యువత
, శనివారం, 13 మార్చి 2010 (19:50 IST)
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివశిస్తున్న యువతకు ఉపయోగకరంగా గ్రామీణ ఉపాధి శిక్షణా కేంద్రం(ఆర్ఎస్ఈటీఐ)ను దేశంలోని పలు గ్రామాలలో ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంది. ఇందులో భాగంగా దేశంలోని దారిద్ర్యరేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న పేద యువతీ, యువకులకు వారి అభిరుచుల మేరకు, స్థానిక వనరులు, ఉపాధిమార్గాల ఆధారంగా ఆర్ఎస్ఈటీఐ శిక్షణనిస్తుంది.

ప్రధానంగా వ్యవసాయం, దాని అనుబంధ విభాగాలకు ఆర్ఎస్ఈటీఐ శిక్షణలో పెద్దపీట వేయనుంది. దీంతో పాటు ఉత్పాదక రంగం, ఆటోమొబైల్, కొత్తగా మార్కెట్‌లోకి వచ్చే ఉపాధి మార్గాలకు అనుగుణంగా యువతీ యువకులకు ఆర్ఎస్ఈటీఐ శిక్షణా కేంద్రాలలో శిక్షణనిస్తారు.

వ్యవసాయ ఉత్పత్తుల ప్రొసెసింగ్ యూనిట్లను మంజూరుచేసి వాటి ద్వారా నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి మార్గాన్ని అందజేయాలన్నదే ఈ శిక్షణా కేంద్రం ప్రధాన లక్ష్యం. ఉత్పాదక రంగంతో పాటు సేవారంగానికి సంబంధించిన ద్విచక్ర వాహనాలు, టీవీ, రేడియో, సెల్‌ఫోన్ల రిపేర్లు, మోటారు రివైండింగ్, బేకరీ ఉత్పత్తుల తయారీకి చెందిన శిక్షణను ఈ కేంద్రంలో ఇస్తారు.

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శిక్షణా కేంద్రం నిర్వహణకు జిల్లా స్థాయి అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీ ఉంటుంది. ఇందులో శిక్షణకు నిధులను సమకూర్చే ఆర్థిక సంస్థ ప్రాంతీయ అధికారి చైర్మన్‌గా లీడ్ బ్యాంకు, నాబార్డు మేనేజర్లతో పాటు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరక్టర్, ఉపాధి కల్పనాధికారి, ఐటీఐ, పాలిటెక్నిక్, కృషి విజ్ఞాన కేంద్రాలకు చెందిన ప్రధాన అధికారులుతో పాటు ఇద్దరు, ముగ్గురు గ్రామీణ శిక్షణకు సంబంధించి నిష్టాతులైన వారు సభ్యులుగా ఉంటారు.

శిక్షణా సంస్థను నిర్వహించే ప్రధాన అధికారి కన్వీనర్ గాను, స్థానిక ప్రజా ప్రతినిధులు, దాతలు, వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అదనపు సభ్యులుగా ఉంటారు. ఈ శిక్షణకు ఐటీడీఏ, నెహ్రూ యువ కేంద్రం, జిల్లా పరిశ్రమల విభాగంలో దరఖాస్తులను అందజేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆర్ఎస్ఈటీఐలో శిక్షణ పొందిన నిరుద్యోగులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఎన్ఐఆర్‌డీ లాంటి ప్రతిష్టాత్మకమైన శిక్షణ సంస్థల నుంచి శిక్షణ పొందిన నిష్ణాతులైన అధ్యాపకుల చేత ఇక్కడ శిక్షణ ఇస్తారు. ప్రతి బ్యాచ్‌లో 25-30 మందికి శిక్షణ ఇవ్వనున్న ఈ కేంద్రాల్లో యోగా, పునశ్చరణ తరగతులను కూడా నిర్వహించడం గమనార్హం.

ఇక్కడ శిక్షణ పొందిన అభ్యర్థులకు ప్రమాణపత్రాలను ప్రభుత్వం అందజేస్తుంది. ఈ ప్రమాణ పత్రాలను పొందిన నిరుద్యోగులకు బ్యాంకులు రుణాలను కల్పించే అవకాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ శిక్షణలో మహిళలకు కూడా సమాన అవకాశాలుంటాయి.

Share this Story:

Follow Webdunia telugu