కొరియర్ సంస్థను ప్రారంభించాలనుకుంటే...
, సోమవారం, 30 నవంబరు 2009 (15:20 IST)
ప్రస్తుతం మన దేశంలో పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలలో చాలా కొరియర్ కంపెనీలు విస్తారంగా వ్యాపించివున్నాయి. కాని చిన్న పట్టణాలు, పెద్ద పెద్ద గ్రామాల్లో వీటి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇలాంటి పట్టణాలు, పెద్ద పెద్ద గ్రామాల్లో కొరియర్ సంస్థను స్థాపిస్తే లాభసాటిగా ఉంటుంది. కొరియర్ సంస్థను స్థాపించేందుకు ఏ విద్యాలయం కూడా ప్రత్యేకంగా ఎలాంటి శిక్షణ ఇవ్వడం లేదు. కాబట్టి మీరు కొరియర్ సంస్థను స్థాపించాలనుకుంటే ఏదైనా కొరియర్ సంస్థలో ఒకటి లేదా రెండు సంవత్సరాలు పనిచేయండి. దీంతో మీకు అనుభవం వస్తుంది. ఆ అనుభవంతో మీరు కొరియర్ సంస్థను స్థాపించవచ్చు. అందులోని మెళుకువలు, పలు సంస్థలతో పరిచయాలు ఏర్పడుతాయి. కొరియర్ సంస్థను స్థాపించడం అనేది ఓ గౌరవప్రదమైన సాంప్రదాయంతోపాటు మంచి ఆదాయాన్ని అందించేదిగా ఉంటుంది ఈ కొరియర్ సంస్థ.