Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొత్త క్యాట్‌తో సమస్యలు లేవు

కొత్త క్యాట్‌తో సమస్యలు లేవు
కాలం మారుతోంది. దాంతో పాటు ఇటీవల కాలంలో పరీక్షలు ఆన్‌లైన్‌లోకి వెళ్తున్నాయి. కనుక కంప్యూటర్స్‌ తెలియనివారు.. మరింత ప్రాక్టీసు చేస్తే క్యాట్ సులువైపోతుంది. కొత్తగా వచ్చిన కామన్ అడ్మీషన్ టెస్ట్‌ (క్యాట్)‌తో ఏవిద్యార్థికైనా సౌకర్యంగా ఉండేవి లేవు.. అలాగని అసౌకర్యంగా ఉండేవి లేవు.

నాలుగు కొత్త భారత మేనేజ్‌మెంట్ శిక్షణ సంస్థ (ఐఐఎం)లు ప్రారంభమయినట్లు వెలువడిన ప్రకటన.. భారత్‌లో ఎంబీఏ ఔత్సాహికులందరికీ..
ఈ వారం ఓ శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఈ కొత్త శిక్షణ సంస్థల ప్రారంభంతో 600 అదనపు సీట్లు చేరాయి.

ఇన్ని సీట్ల వెసలుబాటు రావడం.. ఐఐఎం ఔత్సాహికుల్లో కొంత రిలీఫ్ తీసుకువచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే.. తొలిసారి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తుండటంతో ఏవైనా అనుకోని ఇబ్బందులు తలెత్తుతాయేమోనని క్యాట్ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.

ఏదేమైనప్పటికీ.. ఈ సారి క్యాట్ అభ్యర్థులు భారీగా పెరిగే అవకాశం మాత్రం కనిపిస్తోంది. కానీ.. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో తగ్గుముఖం పట్టిన క్యాంపస్ సెలెక్షన్స్, ఉద్యోగాల్లో కోత వంటి అంశాలు అభ్యర్థుల్లో ఇంకా కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

అదలా ఉంచితే.. గత వారంలో ఏడు కొత్త ఐఐఎంల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ క్లియరెన్స్ ఇచ్చింది. ఇందులో నాలుగు తమిళనాడు, హర్యానా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాల్లో వచ్చే ఏడాది.. అంటే 2010-11 అకడెమిక్‌కు ఈ కొత్త ఐఐఎంలు కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది.

ఇక మిగిలిన మూడు కొంత కాలం తర్వాత కొత్త ఐఐఎంలు రాజస్థాన్, జమ్మూ మరియు కాశ్మీర్, ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. కానీ ప్రస్తుతం క్యాట్ 2008లో 2.7 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. సాధారణంగా ఈ సంఖ్య చాలా తక్కువని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu