మీరు ఇప్పుడే ఉద్యోగంలో చేరారా? మీ కెరీర్‌లో ఎలా పైకి రావాలని ఆలోచిస్తున్నారా? మీ కోసం.. కొన్ని చిట్కాలు ఇవిగో...
ఉద్యోగంలో చేరిన తొలిదశలోనే మీ వ్యక్తిగత స్థాయిని స్థిరపర్చుకోండి. మీ అర్హత, అనుభవం ప్రాతిపదికగా ఉద్యోగం పొందుతారు. కాబట్టి.. మీరు బాధ్యతల నిర్వహణకు సరైన వ్యక్తి అని తెలుసుకోండి.
పై అధికారుల సూచనలను, సలహాలను పాటిస్తూ ఉండండి. రెండో దశలో మీరు సక్రమంగా పనిచేయడం వల్ల సంస్థ నమ్మకాన్ని పొందవచ్చును. మీ పనితీరును పై అధికారులు గమనిస్తూ ఉంటారు కాబట్టి... మీకు అప్పగించిన పనిని నైపుణ్యవంతంగా సమర్పించేందుకు కృషి చేయండి.
మూడో దశలో సంస్థ మీ మీద నమ్మకం సాధికారతను సంపాదిస్తుంది అంటే.. ఒక పని బాధ్యతను అప్పగించి దాన్ని నిర్వహించే తీరుని, దానిపై తీసుకునే నిర్ణయాలను మీకే వదిలేస్తారు. దీంతో సంస్థ మీ నుంచి కేవలం ఫలితాలను మాత్రమే ఆశిస్తూ, మీకు కావలసిన వనరులను సమకూరుస్తుంది. ఈ దశలో సంస్థ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేసే పనితనం మీలో వస్తుంది.
ఇంకా కెరీర్‌లో డెవలప్ కావాలంటే... ప్రతి వ్యక్తి కెరీర్‌లో సాంకేతిక నైపుణ్యం, నిర్వహణా నైపుణ్యం, వ్యక్తి నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోవాలి. ఒక దీర్ఘకాలిక ప్రణాళికలా ఇది పాటిస్తే, కెరీర్‌లో ఉన్నత స్థాయికి త్వరగా చేరుకోగలుగుతారు.