ఒకపుడు ఐటీ కోర్సుల పట్ల ఆదరణ చూపిన విద్యార్థులు ప్రస్తుతం కామర్స్ గ్రూపులపై మొగ్గు చూపుతున్నారు. దీంతో కళాశాలలు కూడా తమ పంథాను మార్చుకున్నాయి. నిన్నమొన్నటి వరకు సాఫ్ట్‌వేర్ కోర్సులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన కళాశాలలు ప్రస్తుతం కామర్స్ గ్రూపులను ప్రోత్సహిస్తున్నాయి. ఇంజనీరింగ్, మెడిసన్ కోర్సుల తర్వాత ఈ గ్రూపులకు ఆదరణ ఎక్కువైంది.
అలాగే.. బీకామ్, ఎంకామ్ పూర్తిచేసిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కూడా గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా.. షాపింగ్ మాల్స్, ఇతర వాణిజ్య సముదాయాల ఉపాధిలో కామర్స్ పూర్తి చేసిన విద్యార్థులకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో ఈ కోర్సులను పూర్తి చేసేందుకు విద్యార్థులు అధిక ఆసక్తిని కనపరుస్తున్నాయి.