ఐఐటీలలో మెరుగైన శిక్షణా సదుపాయాలు కల్పించడం ద్వారా విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పారిశ్రామిక శిక్షణ, ఉపాధి కమిషనర్ భన్వర్ లాల్ తెలిపారు.
రాజధానిలోని మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐలో కొత్తగా ఏర్పాటు చేసిన సీఎన్‌సీ లాబరేటరీని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక శిక్షణ సంస్థలను పటిష్టమైనదిగా చేసే విషయంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు.
ప్రతి సంస్థలోనూ రూ. కోటికి పైగా విలువ చేసే ఈ తరహా సీఎన్‌సీ యంత్రాలను సమకూర్చుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ ఉపసంచాలకులు ఎస్వీకే నగేష్, ఐటీఐ ప్రిన్సిపల్ సోమరాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.