ఉపాధికి సంబంధించిన ఇంటర్వ్యూ అంటేనే కొందరు భయపడుతూనే ఉంటారు. ఎందుకంటే.. ఇంటర్వ్యూలో పాస్ అవుతామో లేదో అనడమే దీనికి ప్రధాన కారణం. చాలామంది ఇంటర్వ్యూలో ఫెయిల్యూర్ అవడానికి భయమే ప్రధాన కారణమంటున్నారు... మన సైకాలజిస్టులు. అదే భయాన్ని విడిచిపెట్టి ఇంటర్వ్యూల పట్ల పాజిటివ్‌గా ఆలోచిస్తే అందుకు కావలసిన అర్హతల్లో మీకో అర్హత చేకూరినట్లేనని వారు చెబుతున్నారు.
అందుచేత ఇంటర్వ్యూ పట్ల ముందు పాజిటివ్‌గా ఆలోచించడం, సానుకూల వైఖరితో ఉండటం మంచిదని సైకాలజిస్టులు పేర్కొంటున్నారు.
ఇంటర్వ్యూలకు మీరే వెళ్లేటయితే... ఇంటర్వ్యూలో మీ ప్రవర్తన, లక్షణాలనే గమనిస్తుంటారు కాబట్టి... ముఖ్యంగా మీ వేషభాషలు, హావభావాలు, కదలికలను సక్రమం చేసుకోండి.
మిమ్మల్ని చూడగానే సెలక్షన్ బోర్డు సభ్యుల్లో సదభిప్రాయం కలిగించడంలో దుస్తులు ప్రధాన పాత్ర వహిస్తాయి. కాబట్టి. మరీ వదులుగానో, బిగుతుగానో దుస్తులను ధరించకుండా... మీ శరీరాకృతికి చక్కగా నప్పేవిగా ధరించుకోవాలి. అలాగే మీ హెయిర్ స్టెయిల్, ఇంటర్వ్యూ హాలులో ప్రవేశించే ముందు మీ హావభావాలను చక్కగా ప్రదర్శించండి. ఇలా చేస్తే... ఇంటర్వ్యూలో మీరు పాసైనట్టే...