నేటి యువత సైకిల్ ప్రయాణానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. అయితే రాజధానిలోని సెంట్రల్ విశ్వ విద్యాలయంలో ఉన్న విద్యార్థులు మాత్రం ఈ ద్విచక్ర వాహనానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే.. సైకిల్ ప్రయాణం అటు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతో సాయపడుతుందంటారు.
ఏమిటీ.. పర్యావరణానికి ఎలా సహాయపడుతుందని ఆశ్చర్య పోతున్నారా? సైకిల్ వాడకం వల్ల ఎలాంటి కాలుష్య వాయువులు విడుదల కావుకదా? ఇది పర్యావరణానికి మేలు చేసినట్టే కదా? అని ఇక్కడి విద్యార్థుల వాదన. అంతేకాకుండా.. పెట్రోల్ ధరలు భగ్గుమంటన్న ఈ తరుణంలో సైకిల్ వాడకమే ఉత్తమమని అంటున్నారు.
ఈ యూనివర్శిటీలో ప్రతి విభాగంతో పాటు.. హాస్టల్స్‌కు, షాపింగ్ మాల్స్‌కు, లైబ్రరీల మధ్య ఉండే దూరం కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల తమ పనులను త్వరితగతిన పూర్తి చేసుకునేందుకు సైకిల్ వాడుతున్నట్టు విద్యార్థులు అంటుంటారు.