Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విభిన్నమైన సామర్థ్యాలకు పట్టం కట్టే సేల్స్ రంగం

విభిన్నమైన సామర్థ్యాలకు పట్టం కట్టే సేల్స్ రంగం

Munibabu

, గురువారం, 7 ఆగస్టు 2008 (15:31 IST)
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం అనేది ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఉద్యోగం అంటే కుర్చీలో కూర్చుని కాగితాలపై సంతకాలు పెట్టడం, సాయంత్రం అవ్వగానే ఇంటికి చేరుకోవడం అనే కాలం ప్రస్తుతం మారిపోయింది. అలాంటి ఉద్యోగాలు అందరికీ లభించడమంటే అది ఖచ్చితంగా వీలుకాదు.

అయితే మీలోని సామర్ధ్యాలను పూర్తి స్థాయిలో ప్రదర్శించగల్గితే వివిధ రకాల ఉద్యోగాలు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ముందుకు వస్తాయి. అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సేల్స్ రంగం. ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయబడిన ఓ వస్తవు వినియోగదారున్ని చేరాలంటే దాన్ని అమ్మేవారు ఉండాలి. అలా అమ్మేవారికి ఆ వస్తువును తమ దుకాణంలో ఉంచి అమ్మాలనే ఆలోచన రావాలి. అలాంటి ఆలోచన వ్యాపారుల్లో రంపించి కంపెనీ యెక్క ఉత్పత్తిని ప్రజల వద్దకు చేర్చాలంటే సేల్స్‌మెన్ అనేవారు తప్పనిసరి.

అయితే పైన చెప్పినంత సులభంగా మాత్రం సేల్స్ రంగం ఉండదనే చెప్పవచ్చు. ఇతర కంపెనీల నుంచి ఎదురయ్యే పోటీని సమర్థంగా ఎదుర్కొంటూ వివిధ రకాల వస్తువుల మధ్య తమ కంపెనీ ఉత్పత్తి గొప్పదనే విషయాన్ని తెలిపి దాన్ని వినియోగదారుడు కొనేలా చేయాలంటే ఎంతటి చాకచక్యం, ఎంతటి సమయస్ఫూర్తి, ఎంతటి ఓర్పు కావాలో అందరికీ తెలిసిందే. అందుకే సేల్స్ రంగం అనేది అందరికీ సులభంగా రుచించకపోవచ్చు.

కానీ ఈ రంగంలో ఉన్న అంశాలను ఆకలింపు చేసుకుని దానికి అనుగుణంగా తమను తాము మార్చుకుంటూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ముందుకు దూసుకెళ్ల గల్గితే మాత్రం అతి కొద్ది కాలంలోనే ఈ రంగంలో ఉన్నతస్థాయికి చేరడంతో పాటు ఆకర్షణీయమైన జీతభత్యాలను సంపాదించవచ్చు.


ఒకకాలం వరకు సేల్స్ అనేది కొన్ని రంగాలకే పరిమితమైంది. కానీ నేటి ఆధునిక పోటీ యుగంలో దాదాపు ప్రతిరంగంలోనూ ఈ సేల్స్ అనే శాఖ ఉంటోంది. ఉత్పాదన ఏదైనా దాన్ని వినియోగదారుని ముంగిటికి చేర్చాలంటే మాత్రం సేల్స్ రంగంలోని వారికి కొన్ని అర్హతలు తప్పనిసరి. సేల్స్ రంగంలో ప్రవేశించేవారు ముందుగా కింది అంశాల్లో తమను సంసిద్ధుల్ని చేసుకోవాలి.

తాము ప్రవేశించాలనుకుంటున్న కంపెనీ యెక్క ప్రాధమిక సమాచారాన్ని తెల్సుకోవాలి. దానికి అనుగుణంగా తమ రెజ్యూమేను రూపొందించుకోవడంతో పాటు ఆ కంపెనీ ఇంటర్వ్యూ ఎలా ఉండే అవకాశముందన్న విషయంపై అవగాహనకు రావాలి. ప్రస్తుతం మార్కెట్‌లో వస్తోన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకలింపు చేసుకుంటూ ఎలాంటి పరిస్థితుల్లోనైనా చొచ్చుకు పోగలిగే సామర్ధ్యాన్ని సాధించాలి.

మార్కెటింగ్ రంగానికి ప్రాధమికంగా డిగ్రీ సరిపోయినా నేడు చాలా సంస్థలు ఎంబీఏకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అలాగే ప్రారంభంలో చెప్పుకున్నట్టు సేల్స్ రంగం అంటే ఫ్యాన్ కింద కూర్చుని చేసే ఉద్యోగం కాదు. బయట తిరిగి చేయాల్సిన ఉద్యోగం. అందుకే బయట తిరిగేందుకు అవసరమైన ఓపిక, ఉత్సాహం మనలో ఉన్నాయా అంశాన్ని ముందుగా అంచనా వేసుకోవాలి. దీంతోపాటు కొన్ని సమయాల్లో మీరు కలవాల్సినవారు ఆలస్యం చేస్తే చికాకు, కోపం తెచ్చుకోకుండా ఓపిగ్గా ఎదురుచూడగలగాలి.

వీటితోపాటు ఇంగ్లిషు భాషపై మంచి పట్టు కల్గి ఉంటే మంచిది. సంస్ధ నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి, ఇతరుల ఒప్పించే నేర్పు, విషయాల పట్ల సానుకూల ధృక్పధం, ఆత్మవిశ్వాసం, సమయపాలనలాంటి అంశాల్లో ముందుండగలగాలి. పైన చెప్పిన విధంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోగల్గితే సేల్స్ రంగంలో మంచి పురోగతి సాధించవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu