Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త్వరలోనే దూరవిద్యా విధానంలో ఐఐటీ కోర్సులు

Advertiesment
దూరవిద్యా విధానం ఐఐటీ కోర్సులు
, శుక్రవారం, 6 జూన్ 2008 (14:32 IST)
ఐఐటీ కోర్సుల్లో చేరలేకపోయామనే బాధ ఇక విద్యార్థులకు అనవసరం. దూర విద్యా విధానం ద్వారా ఐఐటీ కోర్సులు చేసే రోజులు ఎంతో దూరంలో లేదు. ఐఐటీ సహా ప్రధాన విద్యా సంస్థలు ప్రస్తుతం తమ పీజీ కోర్సులను దూరవిద్యా విధానం ద్వారా అందించేందుకు ముందుకు రానున్నాయి.

దీనికోసం విదేశాల్లో ఈ తరహా కోర్సులు ఎలా అందిస్తున్నాయని ఆరా తీస్తున్నాయి. దీనిపై ఓ నమూనా ప్రణాళికను కేంద్రం సిద్ధం చేసింది. దేశంలోని అన్ని ఐఐటీలను కలిపి ఆన్‌లైన్ తరగతులు, వీడియో కాన్ఫరెన్సింగ్ విధానం ద్వారా ప్రయోగాత్మకంగా అమలు చేయాలని భావిస్తోంది.

మొత్తం 140 పాఠ్యాంశాలను రూపొందించి, ఆన్‌‌లైన్ ద్వారా వినియోగిస్తున్నారు. దూరవిద్యా కమిటీ దీనికి సంబంధించిన కార్యకలాపాలను నియంత్రించే అధికారం కలిగి ఉండేలా రూపొందిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu