సౌదీలోని అతిపెద్ద విద్యుత్ సాధనాల ఉత్పత్తి కంపెనీ అల్ఫానార్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్‌లో ప్యానెల్ బోర్డు వైర్‌మెన్, ప్యానెల్ బోర్డు బస్ బార్ టెక్నీషియన్, ప్యానెల్ బోర్డు అసెంబ్లర్ పోస్టులు ఉన్నాయి.
ఐటీఐ చేసి, వైరింగ్, లే అవుట్ డిజైన్‌లలో మూడు, నాలుగేళ్ల అనుభవం కలిగిన వారు ప్యానెల్ బోర్డు వైర్‌మేన్ పోస్టుకు, బస్‌బార్ బ్లాంకింగ్, పంచింగ్, బెండింగ్ పనుల్లో మూడు నాలుగేళ్ల అనుభవం కలిగన వారు బస్‌బార్ టెక్నీషియన్ పోస్టుకు, ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డు అసెంబ్లీ పనుల్లో మూడు నాలుగేళ్ల అనుభవం కలిగిన వారు టెక్నీషియన్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులు, ఇతర వివరాలకు భారత్‌లోని ఆ సంస్థ మానవవనరుల విభాగాన్ని హెచ్‌ఆర్ కోఆర్డినేటర్ ఫార్ ఇండియా, కేరాఫ్ అల్ఫానర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కేజీ గాలక్సీ, రెండో అంతస్తు, ఎఫ్-36, రెండో అవెన్యూ, ఈస్ట్ అన్నానగర్, చెన్నై-102 అడ్రస్‌లో స్వయంగా సంప్రదించవచ్చు. దరఖాస్తులను 0096612750606 నెంబరుకు ఫ్యాక్స్ చేయవచ్చు.