సౌదీ అరేబియా ప్రభుత్వం నర్సులకు ఆహ్వానం పలుకుతోంది. దీనికి సంబంధించి అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు జూన్ నెలలో చెన్నైలో ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. బీఎస్సీ, డిప్లోమా కోర్సులు చేసి నర్సు వృత్తిలో రెండేళ్ల అనుభవం కలిగిన వారిని ఈ ఉద్యోగాలకు పరిశీలిస్తారు.
అత్యవసర చికిత్స, కీలక చికిత్సలు, రోడ్డు ప్రమాదాలకు చికిత్సలు చేయడంలో అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 30వరకు తమ సీవీలు, ధృవపత్రాల నకళ్లు, ఫోటోలతో నమోదు చేయించుకోవాలి.
చెన్నై, గ్రీమ్స్ రోడ్డులోని మురుగేశ నాయక్కర్ కాంప్లెక్స్‌లోని మొదటి అంతస్తులో ఉన్న అపోలో హెల్త్ రిసోర్సస్ లిమిటెడ్‌లో ఉదయం పది- సాయంత్రం ఐదు గంటలలోపు స్వయంగా కానీ లేక 044-65511088 నెంబర్‌లో ఫోన్ ద్వారా కానీ సంప్రదించవచ్చు.