సీఎన్‌సీ యంత్రాల్లో పనిచేసిన అనుభవం కలిగిన మిల్లర్లు, టర్నర్లకు సింగపూర్‌లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఐటీఐ, డిప్లొమా చేసి, కనీసం మూడేళ్ల అనుభవం కలిగిన 32 ఏళ్లలోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మంచి ఆంగ్ల భాషా పరిజ్ఞానం, శారీరక దృఢత్వం కలిగిన వారు దీనికి అర్హులు. ఆసక్తి ఉన్న వారు ఏ4 సైజ్ ఫోటోలు, అర్హత. అనుభవాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాల నకళ్లు, ఒరిజినల్ పాస్‌పోర్టుతో పాటు సంప్రదించాలి.
అన్నీ సిద్ధంగా ఉంటే సింగపూర్ సంస్థ ప్రతినిధులను చెన్నై, సైదాపేట, లిటిల్ మౌంట్‌లో మౌంట్ రోడ్డుపై ఉన్న చెక్కర్స్ హోటల్‌లో మే 31, జూన్ 1 తేదీల్లో జరిగే ఇంటర్వ్యూల ద్వారా సమావేశం కావచ్చు.