Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సాంకేతికంగా ఉన్నత విద్యల కళాశాల

Advertiesment
అమెరికాలోని రెమింగ్టన్ కళాశాల బిజినెస్
, మంగళవారం, 4 డిశెంబరు 2007 (17:29 IST)
అమెరికాలోని రెమింగ్టన్ కళాశాల బిజినెస్, ఐటీ, హెల్త్‌ కేర్, క్రిమినల్ జస్టిస్, కాస్మెటాలజీ మరియు డిజైన్‌లలో ప్రొఫెషనల్ విద్యాబోధనను చేస్తున్నది. తమ కళాశాలలో విద్యను అభ్యసించే గ్రాడ్యుయేట్ కాగోరిన విద్యార్థులు తమ కెరీరీ క్షేత్రంలో తగు ఉద్యోగాన్ని సంపాదించుకునే క్రమంలో రెమింగ్టన్ కళాశాల ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను అందిస్తున్నది.

రెమింగ్టన్‌‌ నుంచి బయటకు వచ్చిన గ్రాడ్యుయేట్‌లు పరిశ్రమలకు అవసరమైన రీతిలో నిపుణులుగా అందుబాటులోకి వస్తున్నారు. తత్ ఫలితంగా, కేవలం థియరీలోనే కాక, ప్రస్తుత ప్రపంచానికి ఉపకరించే నైపుణ్యాలను గ్రాడ్యుయేట్లు అందిపుచ్చుకుంటున్నారు. పరిశ్రమకు ఉపకరించే వాస్తవిక నైపుణ్యాలు ప్రధాన లక్ష్యంగా రెమింగ్టన్ కళాశాలలో అన్ని కోర్సులు రూపొందించబడ్డాయి.

కళాశాలకు గల ఈ ఫిలాసఫీ, కళాశాలలో పట్టభద్రులైన యువతీయువకులు తమ నైపుణ్యాన్ని ప్రత్యక్షంగా కార్య క్షేత్రంలో అమలు చేస్తున్నారు. అక్రెడేటింగ్ కమీషన్ ఆఫ్ కెరీర్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆఫ్ టెక్నాలజీ (ఏసీసీఎస్‌సీటీ) గుర్తింపు పొందిన రెమింగ్టన్ కళాశాల, ఓహియో, కొలరాడో, టెక్సాస్, హవాయి, అలబామా, అరిజోనా, అర్కాన్సస్, ఫ్లోరిడా మరియు కాలిఫోర్నియాలో విద్యా ప్రాంగణాలను నిర్వహిస్తున్నది.

Share this Story:

Follow Webdunia telugu