తమ ఉద్యోగులకు గ్లోబల్ బిజినెస్ లీడర్‌షిప్ శిక్షణను అందించే దిశగా ఈ రంగంలో పేరుపొందిన సత్యం స్కూల్ ఆఫ్ లెర్నింగ్‌తో హార్వార్డ్ బిజినెస్ స్కూల్ పబ్లిషింగ్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ ఇప్పటికే అంతర్జాతీయంగా పేరొందిన 21 అత్యున్నత సంస్థలతో ఇలాంటి ఒప్పందాలను కుదుర్చుకోగా ఇప్పుడు సత్యంతోనూ చేతులు కలిపింది.
ఈ ఒప్పందం మేరకు సత్యం స్కూల్ ఆఫ్ లెర్నింగ్ నుంచి హార్వార్డ్ బిజినెస్ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు నాయకత్వ నైపుణ్యాలను పెంచుకొనేందుకు ఉపకరించే పాఠ్యాంశాలు, కేస్ స్టడీస్, ఆన్‌లైన్ పాఠాలు లభిస్తాయి.