Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెల్డర్లకు ఆకర్షణీయమైన జీతంతో షార్జాలో ఛాన్స్

వెల్డర్లకు ఆకర్షణీయమైన జీతంతో షార్జాలో ఛాన్స్
, మంగళవారం, 22 ఏప్రియల్ 2008 (14:22 IST)
షార్జాలోని ఓ కెనడా ఇంజనీరింగ్ కంపెనీ జీఎంఏడబ్ల్యూ లేక ఎఫ్‌సీఏడబ్ల్యూ అర్హతా ప్రమాణాలు కలిగి, రెండేళ్లకు పైగా అనుభవం కలిగిన వెల్డర్లను ఉద్యోగావకాశాల కోసం ఆహ్వానిస్తోంది.

ఉచిత భోజన సదుపాయంతో పాటు ఆకర్షణీయమైన వేతనం, బస, రవాణా వసతులను కూడా కల్పిస్తామని ఆ సంస్థ చెబుతోంది. అయితే ఉద్యోగాల కోసం వచ్చే వారు వెంటనే విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఏప్రిల్ 21-23 తేదీల మధ్య యాగ్నెల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కాంప్లెక్స్, ఫాదర్ యాగ్నెల్ ఆశ్రం, బ్యాండ్ స్టాండ్, బాంద్రా, ముంబై - 400050 చిరునామాలో విద్యార్హత, అనుభవానికి సంబంధించిన దస్తావేజులు, పాస్‌పోర్టు, ఫోటోలతో ముఖాముఖికి హాజరు కావాల్సి ఉంటుంది.

ఇతర వివరాలకు ఆ సంస్థ ప్రతినిధులను 26423841/42 లేక 9860480515 నెంబరులో సంప్రదించవచ్చు. త్వరపడకుంటే ఆ అవకాశం చేజారిపోవచ్చన్న విషయాన్ని గుర్తుంచుకోండి.

Share this Story:

Follow Webdunia telugu