కువైత్‌లోని హెచ్‌వీఏసీ తయారీ సంస్థకు వివిధ రంగాల్లో వృత్తి నైపుణ్యం, అనుభవం కలిగిన వారిని ఉద్యోగాలకోసం ఆహ్వానిస్తోంది. సంబంధిత రంగాల్లో పదిహేను ఏళ్లకు పైబడి అనుభవం కలిగిన వారిని హెచ్‌వీఏసీ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోస్టులకు పిలుస్తోంది.
అలాగే ఎసీ ఉత్పత్తి విభాగంలో పదేళ్ల అనుభవం కలిగిన వారని ప్రొడక్షన్ ఇంజనీర్ పోస్టులకు, నాణ్యతా ప్రమాణాలకు సంబంధించిన సీనియర్ ఇంజనీర్ పోస్టులకు, ఆరేళ్ల అనుభవం ఉన్న వారిని ఇండస్ట్రియల్ ఇంజనీర్ పోస్టులకు ఎంపిక చేయనున్నామని తెలిపింది.
ఈ పోస్టులు మాత్రమే కాక డిప్లొమా చేసిన అనుభవజ్ఞులకోసం ఎలక్ట్రికల్, మెకానికల్ ఫోర్‌మేన్ పోస్టులు, సీనియర్ ప్రొడక్షన్ ఫోర్‌మేన్, హెచ్‌వీఎసీ ఫోర్‌మేన్, చిల్డ్ వాటర్ సిస్టం ఫోర్‌మేన్ పోస్టులను కూడా అందిస్తోంది.
వీరితో పాటు ఫైర్ అలారం టెక్నీషియన్లు, ఎలివేటర్ టెక్నీషియన్లు, సెంట్రల్ ఏసీ టెక్నీషియన్లు, ఫైర్ ఫైటింగ్ టెక్నీషియన్లు, సీఎన్‌సీ, హైడ్రాలిక్, న్యుమేటిక్ టెక్నీషియన్లు, బిల్డింగ్ మెయింటెనన్స్ టెక్నీషియన్లు, ఎలక్ట్రికల్ టెక్నీషియన్లు, పంప్, క్రేన్ మెకానిక్స్ కూడా కావాల్సి ఉంది.
అంతేకాక కంప్యూటర్ ఆపరేటర్లు, స్టోర్ కీపర్లు, డ్రైవర్లు (కువైత్ డ్రైవింగ్ లైసెన్సు కలిగిన వారు మాత్రమే), పెయింటర్లు, ప్లంబర్లు, ఏసీ అసెంబ్లర్లకు కూడా ఉద్యోగావకాశాలున్నాయి.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు బయోడేటా, సర్టిఫికేట్లు, పాస్‌పోర్టు, ఫోటోలతో పాటు దాహిద్ ట్రావెల్స్, 708, స్టాక్ ఎక్స్ఛేంజి టవర్, ఏడో అంతస్తు, దలాల్ స్ట్రీట్, ముంబై-1 చిరునామాలో సంస్థ ప్రతినిధులతో ఏప్రిల్ 21న జరిగే ఇంటర్వ్యూలో సంప్రదించవనచ్చు.