Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రపంచంలోని అత్యున్నత శాస్త్ర విశ్వవిద్యాలయాలు

Advertiesment
అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్న ప్రపంచ శాస్త్ర విశ్వ విద్యాలయాలు
అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్న ప్రపంచ శాస్త్ర విశ్వవిద్యాలయాల జాబితాను ది టైమ్్స‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సప్లిమెంట్‌ విడుదల చేసింది. 1971లో స్థాపించిన ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 1300 కుపైగా వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యా ప్రమాణాలపై జరిపిన అధ్యయనాల ఆధారంగా ఈ జాబితా విడుదల చేసింది. వాటి వివరాలు.

1. కేంబ్ర్జిడ్‌ విశ్వవిద్యాలయం: బ్రిటన్‌లోని కేంబ్ర్జిడ్‌కు అగ్రస్థానం లభించింది. మరో ఐదేళ్లలో 800వ సంవత్సరంలో అడుగుపెట్టే ఈ శాస్త్ర విశ్వవిద్యాలయంలో వందకు పైగా విభాగాలున్నాయి. 15 వ శతాబ్ధి నుంచే పలు సాహితీ మేధావులను, నోబుల్‌ పురస్కార గ్రహీతలను తయారు చేసిన ఘనత ఈ విశ్వవిద్యాలయానికి ఉంది.

2. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం: ఈ విశ్వవిద్యాలయాన్ని ఎపుడు స్థాపించారో స్పష్టంగా తెలియనప్పటికీ, 1096వ ఏటి నుంచి ఇది పని చేస్తోందనడానికి ఆధారాలున్నాయి. అయితే ప్యారిస్‌ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్‌ విద్యార్థులు చదువుకోవడంపై హెన్రీ 2 రాజు నిషేధం విధించిన 1167 కాలంనుంచి ఈ విశ్వవ్యిదాలయం మంచి ప్రాచుర్యం పొందింది. ఈ విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్న 40 కళాశాలల్లో అందరికీ ప్రవేశం ఉండగా, సెయింట్‌ హిల్డాస్‌ కళాశాలలో మహిళలను మాత్రమే అనుమతిస్తున్నారు.

3. హార్వార్డ్‌ విశ్వవిద్యాలయం: అమెరికాకు చెందిన మరో విశ్వవిద్యాలయమైన హార్వార్డ్‌కు 3వ స్థానం లభించింది. 1636లో స్థాపించినట్టు చెబుతున్న ఈ విశ్వవిద్యాలయానికి స్థాపకులలో ఒకరైన జాన్‌ హార్వార్డ్‌ పేరు పెట్టారు. అమెరికా మాజీ అధ్యక్షులైన జాన్‌ ఆడమ్స్‌, జాన్‌ క్విన్సీ ఆడమ్స్‌, థియోదోర్‌, ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్‌, రూథరఫోర్డ్‌, కెన్నడీ, జార్జ్‌ బుష్‌లు ఈ విశ్వవిద్యాలయంలోనే చదివారన్నది గమనార్హం. ఇప్పటి వరకు 40 మంది నోబుల్‌ అవార్డు గ్రహీతల్ని ఈ విశ్వవిద్యాలయం అందించింది.

Share this Story:

Follow Webdunia telugu