దుబాయ్‌కు చెందిన వేడ్ ఆడమ్స్ కాంట్రాక్టింగ్ ఎల్‌ఎల్‌సీ సంస్థకు పలు రకాల ఉద్యోగాలకు అభ్యర్థులు అవసరమై ఉంది. ప్రాజెక్టు ఇంజనీర్, సైట్ ఇంజనీర్లు, ప్లానింగ్ ఇంజనీర్లు, ప్రొక్యూర్ మెంట్ ఇంజనీర్లు కావాలి.
ప్రొక్యూర్ మెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీతో పాటు, గల్ఫ్‌లోని భారీ ఎలక్ట్రో మెకానికల్ కాంట్రాక్టింగ్ కంపెనీలలో కొనుగోలు కార్యకలాపాలను సాగించే అనుభవం కలిగి ఉండాలి.
ఆసక్తి ఉన్న వారు చెన్నై, చేపాక్‌లోని బెల్స్ రోడ్డు, డోర్ నెంబర్ 116, జెడ్ హౌస్‌లోని ట్రాన్స్ కాంటినెంటల్ ట్రేడర్స్‌ను స్వయంగా కానీ లేక 044-28547706 నెంబర్‌లో ఫోన్ ద్వారా కానీ సంప్రదించవచ్చు. క్లైంట్ ఇంటర్వ్యూ జూన్ 11న జరుగనుంది.
పదో తరగతితో పాటు సంబంధింత రంగాల్లో డిప్లొమా, లేక ఐటీఐ సర్టిఫికేట్లు కలిగి, మూడేళ్ల అనుభవం ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. త్వరలోనే చెన్నైలో సంస్థ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.