ఆరు ఆఫ్రికా దేశాల్లో టెలికమ్యూనికేషన్ సదుపాయాలు అందిస్తున్న ప్రముఖ సంస్థ తమ జాంబియా టెలికాం ప్రాజెక్టుకు డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఇన్‌స్టలేషన్ టెక్నీషియన్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు అహ్వానిస్తోంది.
ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ రంగంలో బీఈ, డిప్లొమా, ఐటీఐ కోర్సులు చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీటీఎస్/బీఎస్సీ/ఎమ్‌డబ్ల్యూ కమిషనింగ్ అండ్ ఓ అండ్ ఎమ్ మేనేజ్‌మెంట్ బాధ్యతలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు బరోడాలోని హోటల్ సాయాజీలో అక్టోబర్ 4,5తేదీలలో ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగే ఇంటర్వ్యూలకు అప్‌డేట్ చేసిన ప్రొఫైల్, తాజా పే స్లిప్, పాస్ పోర్ట్ కాపీతో పాటు హాజరు కావాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు వారం రోజుల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది.