కువైత్ ఆరోగ్య శాఖలో మెడికల్ స్పెషలిస్టులకు అవకాశాలు కల్పించనున్నారు. ఆ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆస్పత్రులకు నియోనాటాలజిస్ట్, కన్సల్టంట్లు, సీనియర్ స్పెషలిస్టులు, స్పెషలిస్టులు కావాల్సి ఉంది.
పీడియాట్రిక్స్‌లో రాయల్ ఫెలోషిప్, కెనడా లేక అమెరికా బోర్డు లేక తత్సమానంగా గుర్తింపు పొందిన ఓ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ అందుకుని, 18 ఏళ్ల అనుభవం కలిగిన వారు (నియోనేటాలజీలో ఐదేళ్లు సహా పీడీయాడ్రిక్స్ విభాగంలో 11 ఏళ్లు) కన్సల్టంట్ ఉద్యోగాలకు అర్హులు.
పై విద్యార్హతతో 14 ఏళ్ల అనుభవం (నియోనాటాలజీలో ఐదేళ్లు సహా పీడీయాట్రిక్స్‌లో 11 ఏళ్ల అనుభవం) కలిగిన వారు సీనియర్ స్పెషలిస్టు, పదేళ్ల అనుభవం కలిగిన వారు (నియోనాటాలజీలో ఐదేళ్లు) స్పెషలిస్టు ఉద్యోగాలకు అర్హులుగా ఉన్నారు.
దరఖాస్తులు, ఇతర వివరాలకు న్యూఢిల్లీ, పంచ్‌శీల్ పార్కు, ఎన్-88లోని ది ఎంబసీ ఆఫ్ స్టేట్ ఆఫ్ కువైత్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.