ఒమన్ సైనిక దళాలకు చెందిన వివిధ ఆస్పత్రులలో పనిచేసేందుకై స్పెషలిస్టు నర్సులకు అవకాశాలు ఇస్తున్నారు. పీడీయాట్రిక్, ఆపరేటింగ్ థియేటర్ నర్సులుగా, స్పెషలిస్ట్ నర్సింగ్ ఆఫీసర్లుగా పనిచేసేందుకై జనరల్ నర్సింగ్‌లో బీఎస్సీ, డిప్లొమా చేసిన వారిని ఆహ్వానిస్తున్నారు.
వీటితో పాటు పీడియాట్రిక్స్, ఆపరేటింగ్ థియేటర్, అత్యవసర చికిత్స విభాగం, ప్రమాదం, ఎమర్జన్సీ ఆర్థోపీడిక్స్‌లలో గుర్తింపు పొందిన డిప్లొమా అదనపు అర్హతగా పరిగణించబడుతుంది. ఏడాది కాంట్రాక్టుతో 452ల ఒమన్ రియాల్ వేతనం కలిగి ఉంటుంది.
కారు అలవెన్సు కింద 60 ఒమన్ రియాల్, అందించడంతో పాటు ఉచిత బస వసతి, వైద్య చికిత్సలు అందిస్తారు. ఏడాదికి 15 ఒమన్ రియాల్‌ల చొప్పున వేతన పెంపు అందించనున్నారు.
ఏటా రెండు ఉచిత రిటర్న్ టికెట్లతో పాటు అరవై రోజుల సెలవు కూడా అందుకోవచ్చు. స్పెషాలిటీ వైద్యంలో కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి. సైన్యంలో అనుభవం కలిగిన వారికి ప్రాధాన్య మివ్వబడుతుంది.
ఈ ఉద్యోగాలపై ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును రెండు పాస్‌పోర్టు సైజు ఫోటోలు జతపరచి, డిఫెన్స్ లయసన్ ఆఫీసర్, కాన్సులేట్ జనరల్ ఆఫ్ సుల్తానేట్ ఆఫ్ ఒమన్, 112, మేకర్ ఛాంబర్ ఫోర్, పదకొండో అంతస్తు, నారిమన్ పాయింట్, ముంబయి-21 చిరునామాకు పంపగలరు.