వివిధ ఆస్పత్రులలో డెంటల్ హైజీనిస్టులను, డెంటల్ సర్జరీ అసిస్టెంట్‌లను ఒమన్ సైనిక దళం ఆహ్వానిస్తోంది. ఇదే విభాగంలో డిప్లొమా చేసి, కనీసం ఐదేళ్ల అనుభవం కలిగిన వారిని ఆహ్వానిస్తున్నారు.
ఏడాది కాంట్రాక్టుతో 243ల ఒమన్ రియాల్ వేతనం కలిగి ఉంటుంది. ఉచిత బస వసతి, వైద్య చికిత్సలు అందిస్తారు. ఏడాదికి 6 ఒమన్ రియాల్‌ల చొప్పున వేతన పెంపు అందించనున్నారు.
ఏటా రెండు ఉచిత రిటర్న్ టికెట్లతో పాటు అరవై రోజుల సెలవు కూడా అందుకోవచ్చు. స్పెషాలిటీ వైద్యంలో కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి. సైన్యంలో అనుభవం కలిగిన వారికి ప్రాధాన్య మివ్వబడుతుంది.
ఈ ఉద్యోగాలపై ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును రెండు పాస్‌పోర్టు సైజు ఫోటోలు జతపరచి, డిఫెన్స్ లయసన్ ఆఫీసర్, కాన్సులేట్ జనరల్ ఆఫ్ సుల్తానేట్ ఆఫ్ ఒమన్, 112, మేకర్ ఛాంబర్ ఫోర్, పదకొండో అంతస్తు, నారిమన్ పాయింట్, ముంబయి-21 చిరునామాకు పంపగలరు.