ఎలక్ట్రికల్ రంగంలో నిపుణులకు ఆకర్షణీయ జీతం, ఉచిత భోజనం, బస, వైద్య, రవాణా వసతులతో పాటు వార్షిక విశ్రాంతి తదితర సౌలభ్యాలతో దుబాయ్, యూఏఈలలో ఆల్‌రోస్తమని గ్రూప్ ఉద్యోగావకాశాలను కల్పించేందుకు ముందుకు వచ్చింది.
సబ్‌స్టేషన్లలో ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్లు- 25 మంది, ఫోర్‌మెన్లు -235 మంది, ఎలక్ట్రికల్ ఛార్జ్ హ్యాండ్-15 మంది, ఎలక్ట్రీషియన్లు -75 మంది, సహాయ ఎలక్ట్రీషియన్లు-50మంది, ఫిట్టర్లు-35 మంది, భవన నిర్మాణ మేస్త్రీలు-30 మంది వెంటనే కావాల్సి ఉందని తెలిపింది.
ఆసక్తి ఉన్న వారు ట్రాన్స్ కాంటినెంటల్ ట్రేడర్స్, జెడ్ హౌస్, నెం.116, బెల్స్ రోడ్డు, చేపాక్, చెన్నై-5కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు 044-285477069/28589857 నెంబర్లలో ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు.