అన్ని రంగాలలో పనిచేసే వారికి కనీస వేతనాలను అమలు చేస్తామని జర్మనీ కార్మిక శాఖ మంత్రి ఓలఫ్ షోల్జ్ హామీ ఇచ్చినట్లు వేల్ట్ యామ్ సొన్న్‌టాగ్ పత్రిక ఊటంకించింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని విభజించే ప్రధానాంశంగా మారిన అన్ని రంగాలలో కనీస వేతనాలకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి ప్రకటించారని దినపత్రిక పేర్కొంది.
సమీపకాలంలో అందరికీ కనీస వేతనాలను అమలు చేయనున్నట్లు వేల్ట్ యామ్ సొన్న్‌టాగ్ పత్రికతో మంత్రి అన్నారు. కనీస వేతనాల చెల్లింపును పటిష్టంగా అమలు చేయడం ద్వారా కార్మికులకు భద్రత కల్పిస్తామని ఓలఫ్ షోల్జ్ తెలిపారు. తపాలా కార్మికులకు కనీస వేతనాలను అమలు చేస్తూ గత వారంలో పార్లమెంటు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైన నేపథ్యంలో మంత్రి ప్రకటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది.