కువైట్‌కు చెందిన ఓ ప్రముఖ హెచ్‌వీఏసీ ఉత్పాదన సంస్థ 15 నుంచి 20 ఏళ్ల అనుభవం కలిగిన హెచ్‌వీఏసీ ఇంజనీర్లను, ఎలక్ట్రికల్ ఇంజనీర్లను, ఉత్పత్తి రంగంలో పదేళ్ల అనుభవం కలిగిన ఏసీ ప్రొడక్షన్ ఇంజనీర్లను, క్వాలీటీ అష్యూరెన్స్ ఇంజనీర్లను, ఆరేళ్ల అనుభవం కలిగిన ఇండస్ట్రియల్ ఇంజనీర్లను ఉద్యోగాల కోసం ఆహ్వానిస్తోంది.
ఇంజనీరింగ్‌లో డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసి, తగిన అనుభవం కలిగిన వారు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు చెన్నై-50, పాడి, ఎంటీహెచ్ రోడ్డు, డోర్ నెం.881ఏలో ఉన్న అక్యురేట్ ఓవర్సీస్ ట్రైనింగ్ సెంటర్‌ను స్వయంగా సంప్రదించవచ్చు.
ఇది మీ సేవార్థం మేము సేకరించి, ప్రచురిస్తున్న ఉద్యోగావకాశం కాబట్టి పూర్తి వివరాలను నిర్ధారించుకోవాల్సిన బాధ్యత మీపై కూడా ఉందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి.