Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విదేశాలలో చదువు'కొనాలంటే'...

విదేశాలలో చదువు'కొనాలంటే'...
, మంగళవారం, 4 డిశెంబరు 2007 (16:56 IST)
అమెరికాలో విద్యను సముపార్జించాలంటే ఖర్చు బాగానే ఉంటుంది. అక్కడ చదువుకోవడానికి ఉత్సాహాన్ని ప్రదర్శించే ఔత్సాహిక విద్యార్థుల సౌకర్యార్ధం అమెరికాలో రమారమిగా అయ్యే ఖర్చుల పద్దును అందిస్తున్నాం.

అమెరికాలో చదువు కోసం ట్యూషన్ మరియు ఫీజుల రూపేణా సాలుకు $5000 నుంచి $35000 వరకు వసూలు చేస్తారు.
జీవన వ్యయం ఎంతనేది ప్రాంతాన్ని బట్టి మారుతుంటుంది. వాషింగ్టన్, కాలిఫోర్నియా మరియు న్యూయార్క్ రాష్ట్రాల చుట్టు పక్కల ప్రాంతాలలో జీవన వ్యయం చుక్కలను అంటుతుంది.
సాధారణ పరిస్థితులలో అయితే జీవన వ్యయం $6000 to $10000 మధ్య ఉంటుంది. ఇక అపార్ట్‌మెంట్‌కు చెల్లించవలసిన అద్దె $450 నుంచి $1000 మధ్య ఉంటుంది.
నిత్యావసర వస్తువులు బహుచౌక (వాల్‌మార్ట్ ఉండనే ఉందిగా!).

Share this Story:

Follow Webdunia telugu