హస్తకళల్లో 270 కోట్ల డాలర్లకు ఎగుమతి!!
, గురువారం, 12 ఏప్రియల్ 2012 (12:54 IST)
గత ఆర్థిక సంవత్సరంలో మనదేశ హస్తకళల ఎగుమతులు 17.5 శాతానికి పెరిగాయి. 2010-11 ఆర్థిక సంవత్సరంలో జరిగిన 230 కోట్ల డాలర్లు విలువైన ఎగుమతులతో పోల్చితే ఇది 17.5 శాతం వృద్ధి చెంది 270 కోట్ల డాలర్లుగా పెరిగిందని హస్తకళల ఎగుమతుల ప్రోత్సాహక బోర్డు (ఈపీసీహెచ్) తెలియజేసింది.గత ఏడాది ప్రధాన మార్కెట్లయిన అమెరికా, యూరప్‌ల నుండి డిమాండ్ తగ్గినప్పటికీ చైనా, లాటిన్ అమెరికా వంటి నూతన మార్కెట్లలో పెరిగిన గిరాకీ కారణంగా, హస్తకళా ఎగుమతులు పెరిగాయని ఈపీసీహెచ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ కుమార్ తెలిపారు.మనదేశం జరిపే మొత్తం హస్తకళా ఎగుమతుల్లో అమెరికా, ఐరోపా మార్కెట్ల వాటా 60 శాతానికిపైగా వుందని రాకేష్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హస్తకళా ఎగుమతులు 300 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోగలవని మండలి భావిస్తోందన్నారు.