Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వార్షిక విరాళం రూ. 9,713 కోట్లు: రెండో ఏడాది కూడా మహోన్నత ఉదారవాది టైటిల్‌ను నిలుపుకున్న అజిమ్‌ ప్రేమ్‌జీ

వార్షిక విరాళం రూ. 9,713 కోట్లు: రెండో ఏడాది కూడా మహోన్నత ఉదారవాది టైటిల్‌ను నిలుపుకున్న అజిమ్‌ ప్రేమ్‌జీ
, గురువారం, 28 అక్టోబరు 2021 (23:40 IST)
హురన్‌ ఇండియా, ఎడెల్‌గివ్‌ నేడు తమ వార్షిక ఎడెల్‌గివ్‌ హురన్‌ ఇండియా ఫిలాంథ్రోపీ జాబితా 2021ను విడుదల చేసింది. భారతదేశంలో మహోన్నతమైన ఉదారవాదులను గుర్తిస్తూ ఈ తరహాలో జాబితా విడుదల చేయడం ఇది 8వ సారి.
 
జాతి నిర్మాణంలో వ్యక్తిగత దాతల ప్రాముఖ్యతను వెల్లడి చేయడం ఈ జాబితా ముఖ్యోద్దేశం. ఈ దాతలు ఏప్రిల్‌ 01,2020 నుంచి 31 మార్చి 2021 నడుమ చేసిన నగదు లేదా ఆ మొత్తంకు సమానమైన విరాళాలను ఈ జాబితా కోసం గుణించడం జరిగింది. భారతదేశంలో అత్యంత సంపన్నులైన 1007 మంది తో తీర్చిదిద్దిన హురన్‌ ఇండియా రిచ్‌ జాబితాను ఇది అనుసరిస్తుంది.
 
ఈ నివేదిక, ఏ విధంగా మన సంపన్నులు విరాళాలనందిస్తున్నారని తెలుసుకోవడానికి మాత్రమే కాదు, ఈ విరాళాలను అందుకుంటున్న రంగాలు, ప్రాంతాలను గురించి కూడా తెలుసుకునే అవకాశం అందించింది. ఈ నివేదిక ద్వారా సామాజిక రంగాలను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతతో పాటుగా భావివృద్ధికి చేయూత నందించాల్సిన రంగాలను కూడా తెలిపారు.
 
ఈ సంవత్సరపు ఎడెల్‌గివ్‌ హురన్‌ ఇండియా ఫిలాంథ్రోపీ జాబితా 2021లో 5 కోట్ల రూపాయలు లేదా అంతకు మించి విరాళం అందించిన వారిని  పరిశీలించారు.
 
‘‘గత మూడు సంవత్సరాలుగా ఎడెల్‌గివ్‌ ఫౌండేషన్‌ మరియు హురన్‌ ఇండియాలు ఎడెల్‌గివ్‌ హురన్‌ ఫిలాంథ్రోపీ జాబితా కోసం భాగస్వామ్యం చేసుకుంటున్నాయి. భారతదేశంలో మారుతున్న పరోపకార ధోరణులను స్ధిరంగా విశ్లేషించడంతో పాటుగా డాక్యుమెంటింగ్‌ చేస్తున్నాయి. ఈ సంవత్సర జాబితా మాకు భారతదేశంలో దాతృత్వాన్ని నడిపించే ఆలోచనలు, అందుకు తగిన ప్రేరణలను తెలుసుకోవడానికి ఓ అవకాశం అందించింది’’ అని విద్యా షా, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌, ఎడెల్‌గివ్‌ ఫౌండేషన్‌ అన్నారు.
 
హురన్‌ ఇండియా ఎండీ, ముఖ్య పరిశోధకుడు అనాస్‌ రహ్మాన్‌ మాట్లాడుతూ, ‘‘ఎడెల్‌ గివ్‌ హురన్‌ ఫిలాంథ్రోపీ జాబితాలో విరాళాలు 2500 కోట్ల రూపాయల నుంచి నేడు 14,750 కోట్ల రూపాయలకు చేరాయి. ఐదేళ్లలో భారత్‌లో సృష్టించబడిన సంపదకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ఈ విరాళాలు త్వరలోనే 30 వేల కోట్ల రూపాయలకు చేరనున్నాయని అంచనా వేస్తున్నాము’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శాస్త్రీయతోనే లాభదాయకమైన సాగు: ఎమ్మెల్యే అంబటి రాంబాబు