డేటింగ్ యాప్‌పై వివాహితులు కూడా ఆసక్తి చూపుతున్నారంటే.. నమ్ముతారా?
దేశంలో పెళ్ళికాని వాళ్లేంటి? వివాహితులు కూడా డేటింగ్‍పై ఆసక్తి చూపుతున్నారని తేలింది. టిండర్ ఇండియా సీఈవో తారూ కపూర్ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీలో ఐఐటీ పూర్తి చేసుకుని హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో గ
దేశంలో పెళ్ళికాని వాళ్లేంటి? వివాహితులు కూడా డేటింగ్‍పై ఆసక్తి చూపుతున్నారని తేలింది. టిండర్ ఇండియా సీఈవో తారూ కపూర్ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీలో ఐఐటీ పూర్తి చేసుకుని హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో గత ఏడాదే గ్రాడ్యుయేట్ అయిన ఈమె.. తన డేటింగ్ యాప్ అయిన టిండర్ గురించిన విశేషాలను ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
భారత దేశంలో పెళ్ళికాని యువతీ యువకులే కాకుండా.. పెళ్ళైన వారు కూడా డేటింగ్ యాప్ పట్ల ఆసక్తి చూపుతున్నారని స్పష్టమైనట్లు తారూ కపూర్ చెప్పారు.
యుక్త వయస్సులో ఉన్నవారి గైడ్ చేస్తున్న తరుణంలో మ్యారీడ్ పీపుల్ సైతం ఈ యాప్ పట్ల ఆకర్షితులు కావడం ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. తమ గైడెన్స్ ద్వారా యువతీ యువకులు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారని, తమకు పెళ్ళి శుభలేఖలు కూడా పంపుతున్నట్లు తెలిపారు.
టిండర్ యాప్ ద్వారానే తాను తన భర్త సాహ్నిని కలుసుకున్నానని చెప్పడంలో నిజం లేదన్నారు. ఐఐటీలో ఆయన తనకు సీనియర్ అని ఆయనతో ఏర్పడిన పరిచయం వివాహానికి దారితీసిందని తారూ కపూర్ వెల్లడించింది. హార్వర్డ్ వర్శిటీకి వెళ్ళేముందే అతనితో వివాహం జరిగిందని తెలిపింది.