విజయ్ మాల్యా అరెస్టు... జస్ట్ 3 గంటల్లో బెయిల్ మంజూరు.. దటీజ్ లిక్కర్ డాన్ పవర్!
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు అరెస్టు అయిన కేవలం 3 గంటల్లోనే బెయిల్ మంజూరైంది. విజయ్ మాల్యాను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మంగళవారం లండన్‌లో అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనను వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజర
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు అరెస్టు అయిన కేవలం 3 గంటల్లోనే బెయిల్ మంజూరైంది. విజయ్ మాల్యాను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మంగళవారం లండన్‌లో అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనను వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరచగా, ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అదీ అరెస్టు అయిన కేవలం 3 గంటల్లోనే బెయిల్ మంజూరు కావడం గమనార్హం.
భారత్‌లోని వివిధ బ్యాంకులకు దాదాపు రూ.9 వేల కోట్లు ఎగవేసిన కేసులో నిందితుడిగా ఉన్న విజయ్‌మాల్యా లండన్‌లో తలదాచుకున్న విషయం తెలిసిందే. దీంతో భారత్ జారీ చేసిన లెటర్ ఆఫ్ రెగోరేటరీ ఆధారంగా యూకే పోలీసులు మాల్యాను అరెస్టు చేశారు. అనంతరం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.
భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 9.30 గంటలకు మాల్యాను అరెస్టు చేసినట్లు యూకే పోలీసులు భారత్‌లోని సీబీఐ అధికారులకు సమాచారమందించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచగా, ఆయనకు 3 గంటల్లోనే వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. విజయ్‌మాల్యాను త్వరలోనే భారత్ తీసుకొచ్చేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.