Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెల్ బ్రాడ్‌కాస్ట్ ఆధారిత పబ్లిక్ హెచ్చరిక వ్యవస్థ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, సెల్‌టిక్‌తో Vi భాగస్వామ్యం

Advertiesment
సెల్ బ్రాడ్‌కాస్ట్ ఆధారిత పబ్లిక్ హెచ్చరిక వ్యవస్థ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, సెల్‌టిక్‌తో Vi భాగస్వామ్యం
, బుధవారం, 15 సెప్టెంబరు 2021 (17:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) కోసం అమలు చేయబడుతున్న తన CAP- కంప్లైంట్ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ అలర్ట్ అండ్ వార్నింగ్ సిస్టమ్(IPAWS) కు మద్దతు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వోడాఫోన్ ఐడియా లిమిటెడ్(VIL) మొదటి టెలికాం సర్వీస్ ప్రొవైడ్ (TSP) అని సెల్ టిక్ ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద సెల్ ప్రసార-ఆధారిత ఉత్పత్తుల ప్రొవైడర్, పబ్లిక్ వార్నింగ్ సిస్టమ్స్ (PWS)లో ప్రపంచ అగ్రగామి సెల్ టిక్.
 
అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్(ICB) ప్రక్రియ తర్వాత, గత సంవత్సరం చివరలో, సెల్ టిక్ నేతృత్వంలోని కన్సార్టియమ్‌కు అత్యాధునిక IPAWS ని ప్రారంభించడానికి ఈ ప్రపంచ బ్యాంక్ సహాయక ప్రాజెక్ట్ లభించింది. ఇది భారతదేశంలో మొట్టమొదటి సెల్ బ్రాడ్‌కాస్ట్ ఆధారిత అత్యవసర మాస్ హెచ్చరిక వ్యవస్థ. ఇది AP సర్కిల్‌లోని Vi చందాదారులకు, Vi యొక్క AP నెట్‌వర్కులో దేశీయ/అంతర్జాతీయ రోమింగ్ కస్టమర్లకు ప్రకృతి లేదా మానవ కారణ విపత్తుల సమయంలో పది భారతీయ భాషలలో భద్రమైన విధానంలో రియల్ టైమ్ జియో-టార్గెటెడ్  హెచ్చరికలను అందిస్తుంది.
 
సెల్ టిక్ CBC ప్లాట్‌ఫాం క్లిష్ట సమయాల్లో మొబైల్ పరికరాలకు స్థాన-ఆధారిత టైమ్ సెన్సిటివ్ సమాచారాన్ని ప్రసారం చేసేందుకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్ నెట్‌వర్క్‌ సాయం తీసుకునేందుకు అధికారులకు వీలు కల్పిస్తుంది. సెల్ బ్రాడ్‌కాస్ట్ ఆధారిత కమర్షియల్ మొబైల్ అలర్ట్ సిస్టమ్ (CMAS) అనేది విపత్తుల సమయంలో పెరిగే ట్రాఫిక్ లోడ్లు మరియు నెట్‌వర్క్ జామ్‌లను తట్టుకోగలుగుతుంది. కీలకమైన సమయాల్లో తీవ్ర విపత్తుల సమయంలో అత్యవసర హెచ్చరిక లను ఆయా ప్రజల ఫోన్ నెంబర్ల అవసరం లేకుండానే కోట్లాది మందికి అత్యవసర సందేశాలుగా అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. తద్వారా ప్రభావిత ప్రాంతంలో పౌరుల  ప్రాణాలను కాపాడుతుంది.
 
ఆంధ్రప్రదేశ్‌లో అత్యవసర హెచ్చరికల వ్యవస్థను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రత్యేక కమిషనర్ కనన్ బాబు, ఐఎఎస్ మాట్లాడుతూ,‘‘ప్రకృతి లేదా మానవ కారణ విపత్తుల విషయంలో పౌరుల ప్రాణాలను కాపాడగల సెల్ టిక్ యొక్క అత్యాధునిక సెల్ బ్రాడ్‌కాస్టింగ్ పబ్లిక్ వార్నింగ్ సిస్టమ్ (పిడబ్ల్యుఎస్) ను దేశంలో అమలు చేసిన మొదటి రాష్ట్రంగా మేం చాలా గర్వపడుతున్నాం. అత్యవసర సమయంలో, నెట్‌వర్క్‌ లు రద్దీగా మారే అవకాశం ఉంటుంది, అలాంటి సమయంలో సమాచారాన్ని సకాలంలో పంచుకోవడం ద్వారా కమ్యూనికేషన్ లైన్‌లను తెరిచి ఉంచడం చాలా ముఖ్యం. ఈ సిస్టమ్ మా కమ్యూనికేషన్ సమయాన్ని 24-48 గంటల నుండి ఒక సంఘటనకు ముందు లేదా విపత్తు సమయంలో సెకన్ల వ్యవధికి తగ్గిస్తుంది. ఈ సందేశం ఎస్ఎంఎస్ తరహాలో వెంటనే చేరుతుంది’’ అని అన్నారు.
 
‘‘ఆంధ్ర ప్రదేశ్  తూర్పు తీరంలో ఉండటం వల్ల  ముఖ్యంగా తుఫానులు, వేడి గాలులు, పిడుగులు వంటి ప్రకృతి వైపరీత్యా లకు గురయ్యే అవకాశం ఉంది. విఐ నెట్‌వర్క్ ద్వారా సెల్ టిక్ యొక్క CAP కాంప్లియెంట్ PWS సొల్యూషన్ అతి తక్కు వగా మానవ ప్రమేయంతో నిర్దిష్ట ప్రాంతాల్లోని వారికి దాదాపుగా రియల్ టైమ్‌లో హెచ్చరిక సందేశాలను ఆటోమేటిక్ గా పంపించేందుకు ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది. మరీ ముఖ్యంగా, ఈ వ్యవస్థను ప్రారంభించిన తర్వాత, ఇప్పటికే ఈ వ్యవస్థను అమలు చేస్తున్న కెనడా, జపాన్, కొరియా, ఇజ్రాయెల్, యుఎఇ, ఆస్ట్రేలియా మొదలైన దేశాల ఎంపిక చేసిన లీగ్‌లో ఆంధ్రప్రదేశ్ కూడా చేరినట్లవుతుంది.  ప్రజల ప్రాణాలను కాపాడే ఈ ప్రాజెక్ట్ కోసం మద్దతును అందించినందుకు గాను నేను విఐకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇతర టిఎస్‌పిల సహకారం కోసం నేను ఎదురుచూస్తున్నాను’’ అని అన్నారు.
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఎపి- అలర్ట్ ప్రాజెక్ట్ కోసం తమ మద్దతును అందించిన మొట్టమొదటి టెలికాం ఆపరేటర్‌గా మారిన సందర్భంగా, వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ చీఫ్ రెగ్యులేటరీ&కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ పి బాలాజీ మాట్లాడుతూ, ‘‘అసాధారణమైన అనుభవాలను అందించేటప్పుడు ఏదైనా సంక్షోభ సమయంలో సహాయం చేయడంతో సహా ఎల్లప్పుడూ మా వినియోగదారుల భద్రతకే మేం అత్యంత ప్రాధాన్యం ఇస్తాం. విఐలో, మేం ఎల్లప్పుడూ సురక్షిత, భద్రతతో పాటు కస్టమర్ సౌకర్యాన్ని పెంచే సంచలనాత్మక భాగస్వామ్యాలు, పరిష్కారాల కోసం చూస్తుంటాం. హెచ్చరిక యం త్రాంగానికి సంబంధించి, ఈ తరహాలో దేశంలోనే మొదటిదైన సీఎంఎఎస్‌కు తోడ్పాటు అందించేందుకు ఏపీఎస్ డీఎంఏ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసిపనిచేయడంలో మొదటగా సహకారాన్ని అందిస్తున్న సంస్థ మాది కావడం మాకు గర్వ కారణం’’ అని అన్నారు. అత్యున్నత ప్రపంచ ప్రమాణాల ఆధారంగా, అత్యవసర సమయాల్లో, వారి గోప్యతను కాపాడు తూ, వారికి అర్థమయ్యే భాషలో మా వినియోగదారులను సురక్షితంగా చేరుకోవడానికి ఇది మాకు సహాయపడుతుంది’’ అని అన్నారు.
 
 సెల్ టిక్ సిఇఒ రోనెన్ డేనియల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘విఐఎల్ సహకారంతో మా అత్యాధునిక ఎమర్జెన్సీ మాస్ అలర్ట్ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందజేయడం గర్వంగా ఉంది’’ అని అన్నారు. ‘‘ప్రపంచంలోని అతిపెద్ద సెల్ బ్రాడ్‌కాస్ట్ ప్రొవైడర్‌గా మరియు క్లిష్ట సమయాల్లో అత్యవసర హెచ్చరికలు, అప్‌డేట్‌లు లేదా సూచనలను పంపడంలో సంవత్సరాల అనుభవం ఉన్నందున, ఆంధ్రప్రదేశ్ వంటి తుఫాను ప్రభావిత రాష్ట్రానికి అటువంటి సేవను అమలు చేయడం యొక్క ప్రాముఖ్యతను మేం అర్థం చేసుకున్నాం. 99.75%  అప్ టైమ్‌తో ఫెయిల్ కానటువంటి మెకానిజం అమలులో ఉన్నందున, అవసరమైన సమయాల్లో భారతదేశ పౌరుల భద్రతను మరింతగా శక్తివంతం చేయడానికి మేం అనేక ఇతర రాష్ట్రాలు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌లతో కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నాం’’ అని అన్నారు.
 
 EU- అలర్ట్, EMTEL, ETWS, EENA, ATIS వంటి అధునాతన ప్రపంచ ప్రమాణాలకు సెల్ టిక్ యొక్క CB వ్యవస్థ మద్దతు ఇస్తుంది. వాస్తవానికి ఇది అనేక దేశాలు ఉపయోగించే ప్రాథమిక మాస్ కమ్యూనికేషన్ మెకానిజం. ఇంటిగ్రేటెడ్ సెల్యులార్ కమ్యూనికేషన్ సిస్టమ్ కోసం చూస్తున్న ప్రభుత్వాలకు దాన్ని ఇది అందిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందమైన భామ ఆ వీడియోతో డిప్రెషన్ లోకి వెళ్ళి?