Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు.. ఆవిరవుతున్న రూ.లక్షల కోట్ల సంపద

ఒకవైపు.. అమెరికా - ఉత్తర కొరియా, మరోవైపు.. భారత్ - చైనా దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ దేశాల్లో ఏ ఒక్క దేశం కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఫలితంగా యుద్ధం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయ

కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు.. ఆవిరవుతున్న రూ.లక్షల కోట్ల సంపద
, శనివారం, 12 ఆగస్టు 2017 (12:20 IST)
ఒకవైపు.. అమెరికా - ఉత్తర కొరియా, మరోవైపు.. భారత్ - చైనా దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ దేశాల్లో ఏ ఒక్క దేశం కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఫలితంగా యుద్ధం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ ఆందోళనలతో లక్షల కోట్ల సంపద ఆవిరైపోతోంది. గడచిన ఐదు రోజుల వ్యవధిలో రూ.6 లక్షల కోట్లకుపైగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద హారతి కర్పూరమై పోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
 
నిజానికి భారతీయ స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఇటీవలి కాలంలో దౌడు తీస్తున్నాయి. ఫలితంగా నిఫ్టీ ఇటీవల 10 వేల పాయింట్ల మార్క్‌ను దాటింది. దీంతో ఇన్వెస్టర్లు ఎంతో సంబరపడ్డారు. మూడో ప్రపంచయుద్ధం రానుందన్న భయాలు సెన్సెక్స్‌ను ఐదు రోజుల వ్యవధిలో 1,100 పాయింట్లు పడగొట్టాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పడిపోయింది. 
 
విదేశీ మార్కెట్ల తీరు కూడా ఇదేవిధంగా ఉండటంతో మరింతకాలం పాటు మార్కెట్ అనిశ్చితి కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ వారం ప్రారంభంలో ఆల్ టైం రికార్డు స్థాయులకు దగ్గరగా ఉన్న సెన్సెక్స్, నిఫ్టీలు ప్రస్తుతం నెల రోజుల కనిష్ఠానికి దిగజారాయి. శుక్రవారంతో ముగిసిన వారాంతానికి సెన్సెక్స్, నిఫ్టీలు మూడున్నర శాతం నష్టాలను నమోదు చేసుకున్నాయి. ఇక ప్రపంచ మార్కెట్లు ఈ ఐదు రోజుల వ్యవధిలో ట్రిలియన్ డాలర్లకు పైగా నష్టపోయాయని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాత్రికి పెళ్లి చూపులు.. అడవిలో పెళ్లి కుమార్తె... ప్రయాణికులకు మార్నింగ్ 'స్టార్స్'