Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"ఐ యామ్ శక్తి" ప్రచారంతో మహిళా సాధికారతను వేడుక జరుపుకుంటున్న అవాన్ ఇండియా

Advertiesment
image

ఐవీఆర్

, సోమవారం, 21 అక్టోబరు 2024 (21:39 IST)
దుర్గాపూజ దీపావళికి మారుతున్నందున, అవాన్ ఇండియా తమ "ఐ యామ్ శక్తి" ప్రచారాన్ని ప్రారంభించింది. దుర్గ మరియు లక్ష్మి దేవతల యొక్క దైవిక శక్తిని మూర్తీభవించిన గొప్ప మహిళలకు ఇది ఒక నివాళి. ఈ ప్రచారం, ఈ దేవతల వలె, శక్తి మరియు సంపద యొక్క లక్షణాలను కలిగి ఉన్న అవాన్ ప్రతినిధుల యొక్క స్థిరత్వం, నాయకత్వం, సంకల్పాన్ని వేడుక జరుపుకుంటుంది.
 
"ఐ యామ్ శక్తి" ద్వారా, బ్రాండ్‌కు మద్దతు ఇవ్వడమే కాకుండా తమ స్వంత జీవితాలను, కమ్యూనిటీలను మార్చుకున్న మహిళల స్ఫూర్తిదాయకమైన కథనాలను అవాన్ హైలైట్ చేస్తుంది. అవాన్ ఇండియా- జీఎం, మార్కెటింగ్, స్నిగ్ధా సుమన్ మాట్లాడుతూ, “తన జీవితాన్ని మరియు తన చుట్టూ ఉన్నవారి జీవితాలను మార్చే శక్తి ప్రతి స్త్రీకి ఉంటుంది. ఈ ప్రచారం మార్పును ప్రేరేపించే, తమ బలాన్ని గుర్తించేలా ఇతరులను ప్రోత్సహించే మహిళలను వేడుక జరుపుకుంటుంది. ఈ మహిళలు అవాన్ ప్రతినిధులు మాత్రమే కాదు; వారు వారి విశేషమైన ప్రయాణాల కథకులు.  శక్తి- రక్షణ కు ప్రతిరూపంగా నిలిచే దుర్గ- సంపదను ప్రతిబింబించే లక్ష్మికి ప్రతిరూపంగా నిలుస్తారు" అని అన్నారు. 
 
135 సంవత్సరాలకు పైగా, అందం, సాధికారత మరియు వ్యవస్థాపకతకు వెలుగురేఖగా అవాన్ నిలుస్తుంది. ఈ పండుగ సీజన్‌లో, అవాన్ ప్రతిచోటా మహిళలను తమ అంతర్గత శక్తిని మేల్కొల్పడానికి, తమ లోపల ఉన్న దేవతను బయటకు తీసుకురావడానికి ఆహ్వానిస్తుంది!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్వా చౌత్: ఆహారంలో విషం కలిపింది... భర్తకు ఇచ్చింది.. అతనికి ఏమైందంటే?