ఇక రైల్వే టిక్కెట్లపై పన్నుబాదుడు ... కార్మిక శాఖ నిర్ణయం.. ఎందుకో తెలుసా?
రైల్వే టిక్కెట్లపై కూడా సెస్సు విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా వచ్చే సొమ్మును కూలీల భవిష్య నిధి, పింఛను, గ్రూప్ బీమా వంటి కనీస సౌకర్యాల కోసం వినియోగించాలని నిర్ణయం తీసుకుంది.
రైల్వే టిక్కెట్లపై కూడా సెస్సు విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా వచ్చే సొమ్మును కూలీల భవిష్య నిధి, పింఛను, గ్రూప్ బీమా వంటి కనీస సౌకర్యాల కోసం వినియోగించాలని నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఆర్థికమంత్రిత్వ శాఖకు కేంద్ర కార్మిక శాఖ ఓ ప్రతిపాదన పంపించింది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో కేంద్రం ఈ కొత్త సెస్సును ప్రకటించే అవకాశం ఉంది. ప్రతి టికెట్‌పై పది పైసల సెస్సు విధించడం ద్వారా ప్రతి ఏటా రూ.4.38 కోట్లు సమకూరుతుంది.
ఈ సొమ్ముతో కూలీల భవిష్య నిధితోపాటు పింఛను, గ్రూప్ బీమా వంటి సౌకర్యాలను అమలు చేయవచ్చని కార్మిక మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. అయితే కార్మిక శాఖ ప్రతిపాదించిన సెస్సును ఒక్కో టికెట్‌పైనే తప్ప ఒక్కో ప్రయాణికుడిపై విధించరు. అంటే ఒక టికెట్‌పై ఎంతమంది ప్రయాణించినా సెస్సు మాత్రం పది పైసలే విధించేలా ప్రతిపాదన చేశారు.