Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇనార్బిట్ మాల్ సైబరాబాద్‌లో అలరిస్తున్న ఫిల్తీ లూకర్స్ ఆర్ట్ ఇన్‌స్టాలేషన్, పైరేట్ బోట్స్

Advertiesment
Inorbit Mall

ఐవీఆర్

, బుధవారం, 22 మే 2024 (17:44 IST)
ఇనార్బిట్ మాల్ సైబరాబాద్ ఈ వేసవిలో మరపురాని రీతిలో సముద్రయానం చేయడానికి తమ అభిమానులు, జూనియర్ సాహసికులందరినీ తమ  లాస్ట్ పైరేట్ కింగ్‌డమ్‌‌కు ఆహ్వానిస్తోంది. మే 18- జూన్ 2 వరకూ జరిగే ఈ వినోద ప్రయాణంలో గేమ్‌లు, వర్క్‌షాప్‌లు, అపరిమిత వినోదం భాగంగా ఉంటాయి. లాస్ట్ పైరేట్ కింగ్‌డమ్ అలంకరణ ప్రతి ఒక్కరినీ పైరేట్స్ దేశానికి తీసుకువెళ్తుంది. విశేషమేమిటంటే, సందర్శకులు మాల్‌లోకి అడుగు పెట్టకముందే, ఫిల్తీ లూకర్ ఆర్ట్ ఇన్‌స్టాలేషన్‌ను ఇంతకుముందెన్నడూ చూడని రీతిలో వీక్షించవచ్చు. మాల్ పైకప్పుపై 'విమ్సికల్ టెంటకిల్స్'గా చెప్పబడే జెయింట్ ఆక్టోపస్ టెంటకిల్స్ కనిపిస్తాయి. మాల్‌లోకి ప్రవేశించిన తర్వాత, జూనియర్లు నిర్భయమైన పైరేట్‌లుగా రూపాంతరం చెందడానికి  పైరేట్ టోపీలను అందుకుంటారు.
 
ఈ యాక్టివేషన్‌లో భాగంగా, జూన్ 2 వరకు ప్రతి వారాంతంలో పిల్లల కోసం మధ్యాహ్నం 12.00 నుండి రాత్రి 8:00 గంటల వరకు వివిధ వర్క్‌షాప్‌లు మరియు ప్రదర్శనలను మాల్ నిర్వహిస్తోంది. పైరేట్ టోపీలు, ఫింగర్ పప్పెట్స్, పైరేట్ కత్తి, పైరేట్ జెండాలు, టెలిస్కోప్‌లను ఎలా తయారు చేయాలనే దానిపై వర్క్‌షాప్‌లు కూడా ఇక్కడ ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్