Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణా యొక్క స్పైసెస్‌ ఎగుమతులు సీఏజీఆర్‌ 37% పెరిగాయి : డ్రిప్‌ క్యాపిటల్‌ నివేదిక

Advertiesment
chilli
, సోమవారం, 11 జులై 2022 (22:11 IST)
1. భారతదేశంలో అత్యధికంగా పసుపు ఉత్పత్తి చేయడంతో పాటుగా మిర్చీ ఉత్పత్తిలో రెండవ స్థానంలో నిలిచింది. 2021 ఆర్దిక సంవత్సరంలో 200 మిలియన్‌ డాలర్ల విలువ కలిగిన స్పైసెస్‌ ఎగుమతి చేసింది.
 
2. ఈ ప్రాంతం నుంచి స్పైస్‌ ఎగుమతులు 2021 ఆర్థిక సంవత్సరం వరకూ గత ఐదేళ్లలో సీఏజీఆర్‌ 37% వృద్ధి నమోదు చేసింది
 
3. భారతదేశంలో పసుపు ఉత్పత్తి పరంగా 30%కు తెలంగాణా తోడ్పాటునందిస్తుంది కానీ అత్యంత అరుదుగా మాత్రమే ఎగుమతులకు తోడ్పాటునందిస్తుంది. ఆసక్తికరమే అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌తో కలిసి భారతదేశపు మిర్చీ ఎగుమతులలో 60%కు తెలంగాణా  2021 ఆర్ధిక  సంవత్సరంలో  తోడ్పాటునందించింది.
 
4. కోవిడ్‌ 19 ఇప్పటికే నూతన అవకాశాలను తెరవడంతో, తెలంగాణా యొక్క స్పైస్‌ ఎగుమతిదారులు అంతర్జాతీయంగా బ్రాండ్‌ ఇండియాకు ప్రాచుర్యం కల్పించడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌ల అవసరాలను తీర్చాల్సి ఉంది.
 
అంతర్జాతీయ ట్రేడ్‌ ఫైనాన్స్‌ కంపెనీ డ్రిప్‌ క్యాపిటల్‌ ఇంక్‌, ఇటీవలనే తమ తాజా కమోడిటీ విశ్లేషణ నివేదికను భారతదేశపు స్పైస్‌ ఎగుమతులపై విడుదల చేసింది. ప్రొప్రైయిటరీ మరియు పబ్లిక్‌గా లభించే డాటా నుంచి పరిశ్రమలో అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ ధోరణులను  అర్ధం చేసుకోవడం వరకూ ఈ నివేదికలో భారతదేశంలో లభ్యమయ్యే వివిధ స్పైసెస్‌ ఎగుమతులను గురించి చర్చించారు.
 
అంతర్జాతీయంగా స్పైసెస్‌ ఎగుమతి పరంగా అతి పెద్ద దేశం ఇండియా. పశ్చిమ కనుమలతో పాటుగా తెలంగాణా, మహారాష్ట్ర, కర్నాటకలోని కొండ ప్రాంతాలలో దాదాపు భారతదేశంలోని 60% పసుపు ఉత్పత్తి చేస్తాయి. అయితే, పసుపు ఉత్పత్తి పరంగా అతి పెద్ద తోడ్పాటును తెలంగాణా అందిస్తూ 30% కమోడిటీకి తోడ్పాటునందిస్తున్నప్పటికీ, ఎగుమతుల పరంగా తెలంగాణా అతి అరుదుగా మాత్రమే తోడ్పాటునందిస్తుంది.
 
అయినప్పటికీ, ఈ ప్రాంతం నుంచి సైసెస్‌ ఎగుమతులు గత ఐదు సంవత్సరాలుగా అంటే 2021 ఆర్ధిక సంవత్సరం వరకూ 37% సీఏజీఆర్‌ వృద్ధిని నమోదు చేసింది. దీనికి విస్తృత శ్రేణిలోని మిరప ఎగుమతులు కారణం. భారతదేశంలో మిరప ఉత్పత్తి పరంగా రెండవ స్థానంలో తెలంగాణా ఉంది. మిరప సాగుకు అత్యంత అనుకూలమైన ప్రాంతాలు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో ఉన్నాయి. ఈ రెండు దక్షిణాది రాష్ట్రాలు 2021 ఆర్థిక సంవత్సరంలో భారతదేశపు మిరప ఎగుమతులలో  60%కు పైగా తోడ్పాటునందించాయి. కర్నాటక మరియు మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు దేశపు మిరపసాగులో దాదాపు 25%కు తోడ్పాటునందించింది.
 
ఆయుర్వేద మరియు భారతీయ సంప్రదాయ ఆహారానికి నూతన ప్రశంసలను తీసుకురావడానికి కోవిడ్‌ 19 ఇతోదికంగా తోడ్పాటునందించింది. సౌకర్యానికి డిమాండ్‌ పెరగడం, విభిన్నమైన రుచులను ప్రయత్నించాలంటూ ప్రయోగాలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపడం వల్ల, తెలంగాణా స్పైస్‌ ఎగుమతిదారులు ఈ అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ల నుంచి అవకాశాలపై ఆధారపడుతూ ఎగుమతుల మార్కెట్‌లో తమ ప్రభావం చూపుతున్నారు.
 
డ్రిప్‌ క్యాపిటల్‌ సీఈఓ/ఫౌండర్‌ పుష్కర్‌ ముకివార్‌ మాట్లాడుతూ, ‘‘పసుపులోని ఔషదగుణాలు మరియు ఇమ్యూనిటీ బూస్టర్‌గా టర్మరిక్‌లాటీ లాంటి బేవరేజస్‌కు అంతర్జాతీయంగా పెరుగుతున్న ప్రాధాన్యత కారణంగా, తెలంగాణా పసుపు ఎగుమతిదారులు మార్కెట్‌లో జరుగుతున్న పరిణామాల పట్ల ఆప్రమప్తంగా ఉండాలి మరియు తమ ఉత్పత్తులను ఆవిష్కరించాలి. ఇది బ్రాండ్‌ ఇండియాను అంతర్జాతీయంగా శక్తివంతం చేయడంతో పాటుగా అంతర్జాతీయ మార్కెట్‌ల అవసరాలను స్పైస్‌ ట్రేడర్లు తీర్చగలరు’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశవ్యాప్తంగా పంపిణీ భాగస్వామ్యం ప్రకటించిన నాయిస్‌