Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీ ట్రంక్, ఒత్తిడి మరియు ఉత్కంఠ నుండి ఉపశమనం కలిగించడానికి ప్రత్యేకంగా టీ

టీ ట్రంక్, ఒత్తిడి మరియు ఉత్కంఠ నుండి ఉపశమనం కలిగించడానికి ప్రత్యేకంగా టీ
, గురువారం, 1 జులై 2021 (18:18 IST)
టీ ట్రంక్ అత్యుత్తమమైన భారతీయ టీ ఆకులను క్యూరేట్ చేస్తుంది మరియు అన్ని సహజ పదార్ధాలను ఉపయోగించి వాటిని ప్రత్యేకమైన మిశ్రమాలలో తయారు చేస్తుంది. గత సంవత్సరం మహమ్మారి ప్రబలిన నాటి నుండీ, మనమందరమూ సాధారణ జీవితం గడపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము, ఐతే మన పనిగంటలు మారాయి, మన స్క్రీన్ సమయము పెరిగిపోయింది, మనం ఆరుబయట తక్కువ సమయం గడుపుతున్నాము మరియు ఈ అంశాలన్నీ మన నిద్రాభంగానికి, ఒత్తిడికి మరియు ఉత్కంఠకూ దోహదపడ్డాయి.
 
మరి ఒత్తిడినుండి తప్పించుకునే ప్రశ్నే తలెత్తని సమయములో, మనం కచ్చితంగా మన ఒత్తిడిని మెరుగ్గా నిర్వహించుకునే మార్గాలపై పని చేయాల్సి ఉంటుంది. సహజంగా నయమయ్యే పరిష్కారాలు ఇమిడి ఉండే ఒక దినచర్యను సృష్టించుకోవడం మనలో అనేక మందికి ఒక మంచి ప్రారంభ బిందువు అవుతుంది. దీనిని గుర్తించి, భారతదేశం యొక్క మొట్టమొదటి ధృవీకృత టీ సొమేలియర్ స్నిగ్ధా మన్‌చందా, మీ రోజువారీ సంక్షేమంలో సులభమైన, తక్కువ ఖర్చు పెట్టుబడితో కూడిన మూలికా టీల సేకరణను ప్రవేశపెట్టింది.
 
టిసేన్లు అని కూడా పిలువబడే మూలికా టీలు కెఫెయిన్-రహితంగా ఉంటాయి మరియు ప్రయోజనకరమైన ధర్మాలు కల పూలు, వేర్లు లేదా ఆకులతో తయారు చేయబడి ఉంటాయి.  చమోమైల్ అనేది అత్యంత ప్రపంచ ప్రసిద్ధి చెందిన మూలికా టీలలో ఒకటి. చమోమైల్ పువ్వులు హిమాలయా పర్వతాల అడుగుభాగం కొండలలో లభిస్తాయి. అది సహజంగా మెదడును శాంతపరచి మరియు మంచి నిద్రను ఇచ్చే అపిజెనిన్ అనబడే ఒక రసాయన ధర్మమును కలిగి ఉండేదిగా చెప్పబడుతుంది.  దీని కెఫెయిన్-రహిత ధర్మము వల్ల ఇది రోజులో ఏ సమయములోనైనా మీరు నెమ్మది వహించి తిరక్కుండా ఉన్నప్పుడు ఆస్వాదించడానికి సరైనది.
 
దాదాపుగా ప్రతి ఒక్కరి కొరకూ మరియు రోజులో ఎ సమయములోనైనా పని చేసేది ఒక టీ అంటూ ఉంటే, అది ఒక కప్పు చమోమైల్ టీ అయి ఉంటుంది అని స్నిగ్ధా మన్‌చందా చెబుతుంది.   లావెండర్ టీ అనేది లావెండర్ మొగ్గలచే తయారు చేయబడిన మరొక ఉపశమనకారి టీ.  అది చాలా ఉపశాంతినిస్తుంది మరియు మన ఇంద్రియాలకు ఉపశమనమిస్తుంది. లావెండర్ టీ కూడా పెద్దలలో ఉత్కంఠ మరియు క్రుంగుబాటు భావనలను తొలగించడానికి ప్రసిద్ధి చెందినది.
 
ఒత్తిడి అనేది, మహిళల్లో ఋతుస్రావాలతో సహా ఇతర శరీర విధులను ప్రభావితం చేయగలుగుతుంది.  PCOS అనేది ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది మహిళలను ప్రభావితం చేసే ఒక స్థితి, ఒత్తిడి అనేది దానికి కారణాలలో ఒకటిగా చెప్పబడుతుంది.  PCOS కోసం ఒక వైద్య నిపుణుడిని సంప్రదించడం ముఖ్యం, అదే సమయంలో స్పియర్‌మెంట్ టీ త్రాగడం మహిళలకు ఎంతో గొప్ప ఉపశమనాన్ని ఇవ్వగలుగుతుంది.
 
ఈ టీ ఋతుస్రావకాలాలలో నొప్పిని తగ్గించగలదనీ అదే విధంగా అవాంఛిత శరీర రోమాల ఎదుగుదలను తగ్గిస్తుందని కూడా క్రమం తప్పకుండా స్పియర్‌మెంట్ టీ త్రాగే అనేకమంది చెప్పారు. PCOS తో పోరాడే మహిళలు రోజుకు 1-2 కప్పుల స్పియర్‌మెంట్ టీ త్రాగాలని స్నిగ్ధా మన్‌చందా సిఫారసు చేస్తుంది, ఎందుకంటే ఇది ఋతుస్రావ చక్రమును క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది.
 
చమోమైల్, లావెండర్ మరియు స్పియర్‌మెంట్ అనేవి కెఫెయిన్-రహితమైన మూలికా టీలు, కాబట్టి, ఒకవేళ వాటిని త్రాగేటప్పుడు మీకు కెఫెయిన్ తప్పినట్లు అనిపిస్తే, మీ దినచర్యలో కనీసం 1 కప్పు తెల్ల టీని చేర్చుకోవాల్సిందిగా స్నిగ్ధా సిఫారసు చేస్తుంది. తెల్ల టీలో తక్కువ పరిమాణములో కెఫెయిన్, ప్రకృతిసిద్ధమైన తియ్యదనం, తేనె లాంటి రుచి మరియు టీల ప్రపంచములో అత్యధిక పరిమాణం యాంటీ ఆక్సిడంట్లు ఉంటాయి. శరీర ఒత్తిడిపై పోరాడేందుకు మరియు వయోభారం యొక్క చిహ్నాలను తగ్గించడానికి తెల్ల టీ మనకు సహాయపడుతుంది.  వయోభార-వ్యతిరేక రూపకల్పనలను అభివృద్ధిపరచడానికి చర్మపోషణలో కూడా ఇది ఉపయోగించబడుతుంది.
 
మనం అందరమూ మన మసాలా చాయ్ ని ఇష్టపడుతుండగా, నిస్సందేహంగా అది మన భావనలను పైకి తేవడంలో గొప్పగా పనిచేస్తుంది. మరోవైపు టీల ప్రపంచాన్ని అన్వేషించదలచే వారికి, స్నిగ్ధా మన్‌చందా 3 చిట్కాలను అందిస్తోంది: “ఒకటి, మీ మూలికా టీలకు ఎటువంటి పాలు చేర్చవద్దు. అవి చాయ్ కంటే భిన్నమైనవి. రెండు, ప్రతీదీ కూడా ఒక మోస్తరుగానే మధ్యస్థంగా తీసుకోవాలి, కాబట్టి రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు మాత్రమే తీసుకోండి. మరి మూడవది, అత్యుత్తమ నాణ్యత గల టీలు తీసుకోండి, అవి పూర్తిగా ప్రకృతిసిద్ధంగా ఉండాలి మరియు ప్రిజర్వేటివ్స్ లేకుండా ఉండాలి.”

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కెనడాలో మండిపోతున్న ఎండలు.. 500మంది కన్నుమూత