Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లింక్డ్ఇన్ 2025 టాప్ కంపెనీల ఇండియా జాబితాలో టాప్ 3 స్థానాల్లో నిలిచిన టిసిఎస్, యాక్సెంచర్, ఇన్ఫోసిస్

Advertiesment
infosys

ఐవీఆర్

, బుధవారం, 9 ఏప్రియల్ 2025 (21:34 IST)
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్‌వర్క్ అయిన లింక్డ్ఇన్, నిపుణులు తమ కెరీర్‌లను పెంచుకోగల అవకాశాలు కలిగిన 25 పెద్ద కంపెనీలతో కూడిన 2025 టాప్ కంపెనీల జాబితాను నేడు భారతదేశంలో ఆవిష్కరించింది. ప్లాట్‌ఫారమ్‌లోని మిలియన్ల మంది నిపుణుల కార్యాచరణ ఆధారంగా, ఈ  జాబితా డిమాండ్‌లో ఉన్న నైపుణ్యాలు, అగ్రశ్రేణి ప్రాంతాలు, ఈ కంపెనీలలోని అతిపెద్ద ఉద్యోగ విధులపై పరిజ్ఞానంను అందిస్తుంది, ఉద్యోగార్ధులు తమ  తదుపరి అవకాశాన్ని కనుగొనడంలో సహాయపడుతుంది. లింక్డ్ఇన్ డేటా ప్రధానంగా ఎనిమిది అంశాల నుండి తీసుకోబడింది. వీటిలో ముందుకు సాగే సామర్థ్యం, నైపుణ్యాల పెరుగుదల, బాహ్య అవకాశం, కంపెనీ అనుబంధం వంటివి కూడా ఉన్నాయి. ప్రస్తుతం అత్యంత పోటీతత్వ ఉద్యోగ మార్కెట్‌లో ఉద్యోగులపై పెట్టుబడి పెడుతున్న, ఇప్పుడు నియామకం చేస్తున్న సంస్థలను అగ్రశ్రేణి కంపెనీల జాబితా హైలైట్ చేస్తుంది. 
 
లింక్డ్ఇన్ కెరీర్ ఎక్స్‌పర్ట్, ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ నీరజిత బెనర్జీ మాట్లాడుతూ, “ఈ సంవత్సరం జాబితా నుండి తెలుసుకున్న అతిపెద్ద పాఠం ఏమిటంటే కంపెనీలు ఈ రోజు ఉన్న స్థానానికి మాత్రమే కాకుండా, రేపు వారు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో నిర్దేశించుకున్న లక్ష్యాలకనుగుణంగా కూడా నియామకాలు చేస్తున్నాయి. టాప్ 25 కంపెనీలలో పంతొమ్మిది కంపెనీలు టెక్నాలజీ, ఫైనాన్స్- ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ రంగాల నుండి వచ్చాయి, వివిధ బృందాలలో పనిచేయగల, విమర్శనాత్మకంగా ఆలోచించగల, త్వరగా అలవాటు పడగల, వ్యాపారంతో పాటు అభివృద్ధి చెందగల, సాంకేతికంగా నిష్ణాతులైన నిపుణుల కోసం కంపెనీలు చూస్తున్నాయి. తమ మొదటి లేదా తదుపరి ఉద్యోగాన్ని పొందాలనుకునే ఎవరికైనా, ఇది మీ పరిధిని పరీక్షించడానికి, నిర్మించడానికి సమయం. మీ ప్రధాన నైపుణ్యాన్ని బలోపేతం చేయండి, బదిలీ చేయగల నైపుణ్యాలను అన్వేషించండి. పరిశ్రమలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో దానికి దగ్గరగా ఉండండి. నిరంతరం మారుతూ ఉండే ఉద్యోగ మార్కెట్‌లో, కెరీర్ స్థిరత్వం అనేది మిమ్మల్ని వేరు చేసే సూపర్ పవర్” అని అన్నారు. 
 
మరో సంవత్సరం పాటు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) అగ్రస్థానాన్ని నిలుపుకుంది, తరువాత యాక్సెంచర్, ఇన్ఫోసిస్ ఉన్నాయి. కాగ్నిజెంట్ 5 స్థానంలో ఉండటంతో, ఈ సంవత్సరం జాబితా భారతదేశంలో నేడు కెరీర్ పురోగతి అవకాశాలను అందించడంలో కంప్యూటర్, ఐటీ- సాఫ్ట్‌వేర్ రంగాల ఆధిపత్యాన్ని వెల్లడిస్తుంది. అభివృద్ధి సాధనాలు, డేటా నిల్వ సాంకేతికతలు, ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్‌లలో ప్రధాన నైపుణ్యాలు వారి నియామక లక్ష్యంకు  కేంద్రంగా ఉన్నాయి, ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలో ఈ ధోరణి కనిపిస్తుంది. 
 
25 కంపెనీలలో దాదాపు సగం- 12 కంపెనీలు- ఈ సంవత్సరం జాబితాలో కొత్తగా చేరాయి, ఇది భారతీయ ఉద్యోగార్ధులకు అందుబాటులో ఉన్న అవకాశాలలో విస్తృత మార్పులను ప్రతిబింబిస్తుంది. ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ (4) అత్యున్నత ర్యాంక్ పొందిన తొలి సంస్థ కాగా, తరువాత సర్వీస్‌నౌ(17), స్ట్రైప్ (21) వున్నాయి. జెపి మోర్గాన్ చేజ్ (7), వెల్స్ ఫార్గో (15), అమెరికన్ ఎక్స్‌ప్రెస్(25)లతో సహా ఆర్థిక సేవల సంస్థలు ఈ సంవత్సరం జాబితాలో ఏడు స్థానాలను ఆక్రమించాయి. ఈ కంపెనీలలో నియమించబడే సాధారణ ఉద్యోగాలలో వ్యాపార కార్యకలాపాల విశ్లేషకుడు, మోసం విశ్లేషకుడు, ఆర్థిక విశ్లేషకుడు ఉన్నారు, వీరికి మూలధన మార్కెట్లు, పెట్టుబడి బ్యాంకింగ్, వాణిజ్య బ్యాంకింగ్‌లో కీలక నైపుణ్యాలు కోరుకుంటున్నారు.
 
గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలు భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించడం కొనసాగిస్తున్నట్లు కూడా జాబితా చూపిస్తుంది. అమెజాన్(8), ఆల్ఫాబెట్ (9), సేల్స్ ఫోర్స్(12) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, డేటా ఎనలిస్ట్, అకౌంట్ మేనేజర్ వంటి పాత్రల కోసం నియామకాలు చేసుకుంటున్నాయి. కృత్రిమ మేధస్సు, ఏఐ ఇంజనీరింగ్, మొబైల్ అప్లికేషన్ అభివృద్ధి ఈ సంస్థలలో ఎక్కువగా కోరుకునే నైపుణ్యాలు. సినాప్సిస్ ఇంక్(13), కాంటినెంటల్ (14), ఆర్‌టిఎక్స్ (20) కంప్యూటర్ హార్డ్‌వేర్, సిగ్నల్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్ కంట్రోల్ సిస్టమ్‌లలో నైపుణ్యాలు కలిగిన వారి డిజైన్ ఇంజనీరింగ్, టెస్ట్ ఇంజనీరింగ్, నాణ్యత హామీ బృందాలలో పెట్టుబడులు పెడుతున్నాయి.
 
టాప్ కంపెనీతో కనెక్ట్ అవ్వడం, ఉద్యోగ అవకాశాలను అన్వేషించడం గురించి నీరాజిత అందిస్తున్న చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:
1. మీ ఆవిష్కరణ సామర్థ్యాన్ని పెంచుకోండి: మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ను మీ డిజిటల్ హ్యాండ్‌షేక్‌గా భావించండి ఎందుకంటే ఇది తరచుగా రిక్రూటర్లు పొందే మొదటి అభిప్రాయం. చక్కగా రూపొందించబడిన ప్రొఫైల్ మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టగలదు. అగ్ర శ్రేణి కంపెనీలచే గుర్తించబడే అవకాశాలను పెంచుతుంది. మీ వృత్తిపరమైన ప్రయాణాన్ని ప్రామాణికంగా ప్రదర్శించడానికి దీన్ని ఉపయోగించండి. అదనపు ప్రయోజనం కోసం, మీ హెడ్‌లైన్, అబౌట్ విభాగాలను మెరుగుపరచడానికి లింక్డ్ఇన్ యొక్క ఏఐ-ఆధారిత ప్రీమియం సాధనాలను సద్వినియోగం చేసుకోండి.
 
2. మీకు ఆసక్తి ఉన్న కంపెనీలను చూపించండి: వారికి ఖాళీ స్థానాలు లేకపోయినా, కంపెనీపై ఆసక్తిని వ్యక్తపరచడానికి లింక్డ్ఇన్ యొక్క “ఐ యాం ఇంట్రెస్టెడ్” ఫీచర్‌ను ఉపయోగించండి. ఇది సంభావ్య అభ్యర్థుల కోసం వెతుకుతున్న రిక్రూటర్ల చెంతకు మిమ్మల్ని తీసుకువెళ్తుంది. అవకాశం వచ్చినప్పుడు మీరు వారి బృందంలో చేరడానికి ఆసక్తిగా ఉన్నారని నియామక నిర్వాహకులకు స్పష్టం చేయడంలో లింక్డ్ఇన్ టాప్ ఛాయిస్ ప్రీమియం ఫీచర్ మీకు సహాయపడుతుంది.
 
3. పరిశోధన కంపెనీలు ప్రోఫెషనల్ ను ఇష్టపడతాయి: కంపెనీలో దరఖాస్తు చేసుకునే ముందు, మీ హోంవర్క్ చేయండి. దాని సంస్కృతి, విలువలు, నాయకత్వం గురించి ఒక అవగాహన పొందడానికి కంపెనీ లింక్డ్ఇన్ పేజీతో ప్రారంభించండి. కీలక కార్యనిర్వాహకులను అనుసరించడం వలన వారు శ్రద్ధ వహించే అంశాలపై మీకు తగిన అవగాహన లభిస్తుంది. ఇవి మీ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉన్నాయో లేదో అంచనా వేయవచ్చు. తమ విజిబిలిటీ మరింత పెంచడానికి, పరిజ్ఙానం తెలుసుకోవడానికి, తగిన ఉద్యోగాలను కనుగొనడానికి లింక్డ్ఇన్ ప్రీమియం అనేక ఫీచర్లను కూడా అందిస్తుంది. 
 
4. నెట్‌వర్క్, నెట్‌వర్క్, నెట్‌వర్క్: మీ లక్ష్య కంపెనీలో ప్రస్తుత, మాజీ ఉద్యోగులతో సంబంధాలను ఏర్పరచుకోవడం వల్ల మీకు తెలియని తలుపులు తెరవబడతాయి. వారిని కలువడం, వారి పోస్ట్‌లపై వ్యాఖ్యానించడం లేదా సమాచార చాట్‌ను అభ్యర్థించడం వల్ల మీకు విలువైన అంతర్గత సమాచారం  లభిస్తుంది. బలమైన నెట్‌వర్క్ రిఫరల్‌లకు కూడా సహాయపడుతుంది. దరఖాస్తుదారులు తమ కనెక్షన్‌ల ద్వారా ఉద్యోగం పొందే అవకాశం 4 రెట్లు ఎక్కువగా ఉందని లింక్డ్ఇన్ డేటా చూపిస్తుంది.
 
5. మీ నైపుణ్యాలను ప్రదర్శించండి- బలోపేతం చేయండి: ఏఐ  ఉద్యోగ మార్కెట్‌ను మారుస్తున్నందున, నాయకులు, రిక్రూటర్లు సరైన నైపుణ్యాల మిశ్రమాన్ని కనుగొనడంపై ఎక్కువగా దృష్టి సారిస్తారు. మీ ప్రొఫైల్ మీ సంబంధిత నైపుణ్యాలు, సామర్థ్యాలు-సాంకేతిక- సాంకేతికత లేనివిను హైలైట్ చేస్తుందని నిర్ధారించుకోండి. అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లో పోటీలో ఉండటానికి లింక్డ్ఇన్ లెర్నింగ్‌లో మీరు కొత్త కోర్సులు, నైపుణ్యాలను కూడా అన్వేషించవచ్చు.
 
2025 టాప్ లార్జ్ కంపెనీస్ ఇండియా జాబితాలో చోటు దక్కించుకున్న 25 కంపెనీలు ఇవే:
1. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
2. యాక్సెంచర్
3. ఇన్ఫోసిస్
4. ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్
5. కాగ్నిజెంట్
6. ఒరకిల్
7. జెపి మోర్గాన్ చేజ్
8. అమెజాన్
9. ఆల్ఫాబెట్
10. ది డిపాజిటరీ ట్రస్ట్ & క్లియరింగ్ కార్పొరేషన్ (డిటిసిసి)
11. క్యాప్‌జెమిని
12. సేల్స్‌ఫోర్స్
13. సినాప్సిస్ ఇంక్
14. కాంటినెంటల్
15. వెల్స్ ఫార్గో
16. హెచ్‌సిఎల్‌టెక్
17. సర్వీస్‌నౌ
18. మోర్గాన్ స్టాన్లీ
19. మాస్టర్ కార్డ్
20. ఆర్‌టిఎక్స్
21. స్ట్రైప్
22. అట్లాసియన్
23. ఎంఎస్‌సిఐ ఇంక్.
24. ఎలి లిల్లీ అండ్ కంపెనీ
25. అమెరికన్ ఎక్స్‌ప్రెస్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...