Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కస్టమర్ల కోసం ‘నేషనల్ ఎక్స్ ఛేంజ్ కార్నివాల్’ను ప్రకటించిన టాటా మోటార్స్

Advertiesment
TATA Cars
, సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (22:47 IST)
భారతదేశపు ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్, ఈరోజు దేశవ్యాప్తంగా తన నేషనల్ ఎక్స్ఛేంజ్ కార్నివాల్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ మెగా కార్నివాల్ సమయంలో, కస్టమర్లు ఏదైనా టాటా మోటార్స్ డీల ర్‌షిప్‌ని సందర్శించడం ద్వారా అన్ని టాటా కార్లు, యూవీలపై ఆకర్షణీయమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఎంపిక చేసిన మోడళ్లపై రూ.60,000 వరకు ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలతో, ఈ మెగా కార్నివాల్ ఈ కస్టమర్ సెంట్రిక్ ఇనిషియేటివ్‌లో భాగంగా 250 నగరాల్లోని టాటా మోటార్స్ అధీకృత డీలర్‌షిప్‌లలో 15 ఫిబ్రవరి 2023 వరకు నిర్వహించబడుతుంది.
 
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్, సేల్స్, మార్కెటింగ్, కస్టమర్‌కేర్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ అంబ మాట్లాడుతూ, “టాటా మోటార్స్‌‌లో, మేం కస్టమర్ అవసరాలను అర్థం చేసుకోవడానికి, వారికి ఆనందకరమైన అనుభవాన్ని అందించడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. దానికి అనుగుణంగా మేం వినియోగదారుల కోసం 12 రోజుల పాటు నేషనల్ ఎక్స్ఛేంజ్ కార్నివాల్‌ను నిర్వహిస్తున్నాం. మా ప్రీవోన్డ్ కార్ల వ్యాపారం విస్తృత నెట్‌వర్క్, టాటా మోటార్స్ అష్యూర్డ్ ద్వారా వారి ప్రస్తుత కార్ల విలువను తెలియజేయడం ద్వారా. నేషనల్ ఎక్స్ఛేంజ్ కార్నివాల్ మా వినియోగదారులను వారికి ఇష్టమైన టాటా కారుకు సులభంగా అప్‌ గ్రేడ్ చేయడంలో సహాయపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. తద్వారా వారు మేం అందించే డిజైన్, డ్రైవ్, భద్రత ఉత్తమ కల యికను ఆనందించవచ్చు’’ అని అన్నారు.
 
టాటా మోటార్స్ అష్యూర్డ్ అనేది కంపెనీకి చెందిన ఇన్ హౌస్‌ ప్రీ-ఓన్డ్ కార్ ప్రోగ్రామ్. ఇది కస్టమర్‌లు తమ ప్రస్తుత కార్లను కొత్త టాటా కార్ల కోసం మార్చుకోవడానికి వన్-స్టాప్ సొల్యూషన్‌ను అందిస్తోంది. 2009లో ప్రారంభమైనప్పటి నుండి, ఈ ప్రీ-ఓన్డ్ కార్ ప్రోగ్రామ్ కాబోయే కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందించడంలో అద్భుతంగా పని చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ ISWOTY: అయిదుగురు నామినీలు వీళ్ళే