Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ. 77.7 కోట్ల పన్నుల తరువాత లాభం నివేదించిన సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

Advertiesment
Bhaskar
, మంగళవారం, 16 మే 2023 (18:50 IST)
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ మార్చి 31, 2023తో ముగిసిన త్రైమాసం మరియు ఆర్ధిక సంవత్సరానికి ఆడిట్ చేయబడిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.
 
ఆర్థిక పరంగా ముఖ్యాంశాలు- 2023 ఆర్ధిక సంవత్సరం...
నికర వడ్డీ ఆదాయం గత సంవత్సరం లోని ₹584.5 కోట్లతో పోలిస్తే ₹746.6 కోట్లుగా ఉంది, ఇది సంవత్సరానికి 27.7% పెరిగింది
FY23 నాటికి బ్యాంక్ సేకరణ సామర్థ్యం 102.2% గా నిలిచింది
FY23లో బ్యాంక్ స్థూల అడ్వాన్స్‌లు రూ. 6,000 కోట్లు కాగా, వికాస్ లోన్ పోర్ట్‌ఫోలియో రూ. 1,200 కోట్లు ను అధిగమించింది
నికర  ఆదాయం గత సంవత్సరం లోని ₹678.0 కోట్లతో పోలిస్తే ₹844.0 కోట్లుగా ఉంది, ఇది సంవత్సరానికి 24.5% పెరిగింది
 
వ్యాపార ముఖ్యాంశాలు
వికాస్ లోన్ పోర్ట్‌ఫోలియో రూ. 1,200 కోట్లు అధిగమించింది.
దీని కోసం కస్టమర్ బేస్ 2.5 రెట్లు పెరిగి ~1.9 లక్షల కస్టమర్‌లకు చేరుకుంది.
FY23లో  స్థూల నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్ (GNPA)లో చెప్పుకోదగ్గ మెరుగుదల. 2023 ఆర్ధిక సంవత్సరం లో 3.1%కి తగ్గాయి.
బలమైన ఆన్-గ్రౌండ్ డిమాండ్ మరియు కార్యకలాపాలు విస్తరించిన  కారణంగా లాభదాయకత కొవిడ్ ముందు స్థాయిలకు తిరిగి వచ్చింది
 
ఈ ఫలితాలపై సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండి మరియు సి ఈ ఓ బాస్కర్ బాబు మాట్లాడుతూ “ఆర్ధిక సంవత్సరం 2023, కోవిడ్ తర్వాత మొదటి సాధారణీకరించబడిన సంవత్సరంగా గుర్తించబడింది, మొత్తం ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన పురోగతి కనిపిస్తుంది . FY23లో బ్యాంక్ స్థూల అడ్వాన్స్‌లు రూ. 6,000 కోట్లు, వికాస్ లోన్ పోర్ట్‌ఫోలియో రూ. 1,200 కోట్లు గా వున్నాయి. వికాస్ లోన్ అనేది బ్యాంక్ యొక్క  ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తి. వికాస్ లోన్ యొక్క AUM  FY23లో రూ. 213 కోట్లు నుంచి  రూ. 1,232 కోట్లు కు పెరిగింది. అదే సమయంలో కస్టమర్ బేస్ 2.5 రెట్లు పెరిగి 1.9 లక్షలకు చేరుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతి వేద విజ్ఞాన పీఠాల్లో అడ్మిషన్లు - దరఖాస్తుకు ఆఖరు తేదీ జూన్ 15