Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెట్రోలు, డీజిల్ కార్లు కొనకండి స్వాములూ.. 750 కిలోమీటర్లు నడిచే సోలార్ కార్లొస్తున్నాయ్

జీఎస్టీ పుణ్యమా అని కార్లధరలు విపరీతంగా తగ్గుతున్నాయని పెట్రోల్ కార్లు, డీజిల్ కార్లు కొని పడేసే మోజులో ఉన్నారా.. అయితే ఇది మీకు సరిపోని వార్తే మరి. శిలాజ ఇంధనాలతో అంటే పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్ల

పెట్రోలు, డీజిల్ కార్లు కొనకండి స్వాములూ.. 750 కిలోమీటర్లు నడిచే సోలార్ కార్లొస్తున్నాయ్
హైదరాబాద్ , సోమవారం, 10 జులై 2017 (06:39 IST)
జీఎస్టీ పుణ్యమా అని కార్లధరలు విపరీతంగా తగ్గుతున్నాయని పెట్రోల్ కార్లు, డీజిల్ కార్లు కొని పడేసే మోజులో ఉన్నారా.. అయితే ఇది మీకు సరిపోని వార్తే మరి. శిలాజ ఇంధనాలతో అంటే పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్ల శకం చాలా స్పీడుగా అదృశ్యం కానుంది. చమురుతో నడిస్తూ ప్రపంచ రహదారులపై రాజసం ఒలికించిన కార్లు, ఇతర వాహనాలకు కాలం చెల్లిపోతోంది. సమీప భవిష్యత్తులోనే విద్యుత్‌తోపాటు నేరుగా సౌరశక్తితోనే నడిచే కార్లు, వాహనాలు బోలెడన్ని మార్కెట్‌లోకి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. 
 
ఇప్పటికే సౌరశక్తితో నడిచే కార్ల నమూనాలు ప్రపంచం మొత్తానికి ఆశలు రేపుతున్నాయి. కారు, ఇతర వాహనాల బాడీ మొత్తాన్ని సౌర ఫలకలతో నింపి సౌరవిద్యుత్తును ఆదా చేస్తే ఒక రోజుంతా ఈ ఫలకలు ఆదా చేసిన విద్యుత్తులో కాలుష్యం జోలికి పోకుండా ఏకథాటిగా 750 కిలోమీటర్లు నడిపేయవచ్చునట. అంటే పెట్రోలు, డీజిళ్ల వంటి ఇంధనాలేవీ లేకుండా కేవలం సూర్యుడి శక్తితోనే హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లపోవచ్చునన్నమాట. 
 
ఎండలు బాగా ఉండే మనలాంటి దేశాల్లోనైతే.. ఇలాంటి కార్లను చార్జింగ్‌ అనేది చేసుకోకుండా నెలలపాటు నడిపేయవచ్చు. విద్యుత్తుతో నడిచే కార్లను అప్పుడప్పుడూ చార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా అక్కడక్కడా చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. 
 
యూరప్‌కి చెందిన ఎలన్‌ మస్క్‌ కంపెనీ టెస్లా ఇప్పటికే నిర్మించి రోడ్డుపైకి తెచ్చిన  లైట్‌ ఇయర్‌ వన్‌తో ఇలాంటి చిక్కులేవీ ఉండవు. ఏ దశలోనైనా ఎండ అనేది దొరక్క కారు నిలిచిపోతే.. సాధారణ విద్యుత్‌ ప్లగ్‌ను వాడుకుని చార్జ్‌ చేసుకునే సౌకర్యమూ ఉంది దీంట్లో! ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ కారు కోసం ఎంతో కాలం వేచి ఉండాల్సిన అవసరమేమీ లేదు. కావాలంటే ఇప్పుడే కొనుక్కోవచ్చు. కాకపోతే బేసిక్‌ మోడల్‌ కారు ధరే రూ.87 లక్షల దాకా ఉంది. అంతే! 
 
కానీ సౌర విద్యుత్తుతో నడిచే కార్లను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి ధరలను తగ్గించడం సాధ్యమైన పక్షంలో చమురు ఆదాయాన్ని పూర్తిగా కోల్పోయే అరబ్ దేశాలు మళ్లీ 50 ఏళ్లకు మునుపటిలాగా అడుక్కుతిని  బతకాల్సిందే. లేకుంటే ప్రపంచమంతా ఇతర దేశాల ప్రజల్లాగా వలస పోవలసిందే.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నం పెట్టే రైతును ఆదుకుంటామన్న జగన్.. హామీలు ఒకే కాని డబ్బుల మాటేమిటి?