ముంబై: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా శ్రీ బిరుపాక్ష మిశ్రా గారు బాధ్యతలు స్వీకరించారు. దీనికి ముందు శ్రీ బిరుపాక్ష మిశ్రా కార్పొరేషన్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు.
శ్రీ బిరుపాక్ష మిశ్రా, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్ (సిఐఐఐబి) యొక్క సర్టిఫైడ్ అసోసియేట్. ఈయన 1984 సంవత్సరంలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా తన బ్యాంకింగ్ వృత్తిని ప్రారంభించారు మరియు శాఖలు, ప్రాంతీయ కార్యాలయాలు మరియు కార్పొరేట్ కార్యాలయంలో వివిధ పరిపాలనా మరియు క్రియాత్మక సామర్థ్యాలలో 35 సంవత్సరాలకు పైగా అపార అనుభవం కలిగి ఉన్నారు.
ఈయన దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. బ్యాంక్ యొక్క క్రెడిట్ మరియు క్రెడిట్ మానిటరింగ్ పోర్ట్‌ఫోలియోను నిర్వహించారు. అలాగే బ్యాంక్ యొక్క ఐటి విభాగానికి నాయకత్వం వహించారు.